ఏడుపొస్తోందంటున్న నారాయణమూర్తి

Update: 2017-01-07 07:16 GMT
సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్న తన సినిమా ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమాకు థియేటర్లు లేకపోవడం చూస్తే తనకు ఏడుపొస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆర్.నారాయణమూర్తి. సంక్రాంతికి థియేటర్లన్నింటినీ పెద్ద సినిమాలతోనే నింపేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగైతే చిన్న సినిమా ఎలా బతకాలన్నారు. పండగలకి కేవలం పెద్ద సినిమాలే రిలీజవ్వాలా అంటూ ఆయన ధ్వజమెత్తారు. తమ సినిమా కోసం ఊరికి ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి దయనీయమని.. ఇది చూసి తనకు తీవ్రమైన ఆవేదన కలుగుతోందని ఆయన అన్నారు.

‘‘తొలిసారి నా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ నెల 14న రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. ఈ సంక్రాంతికి నా సినిమా రిలీజ్ అవుతోంది అంటే.. మెగాస్టార్ - యువ‌ర‌త్న మ‌ధ్య‌లో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్ల‌తో నాకు పోటీ లేదు. ఐతే నా సినిమాకి ఒక్క థియేట‌ర్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. మరీ ఒక్క థియేటర్ కూడా లేదు అంటుంటే ఏడుపొస్తోంది. కొంత మంది చేతుల్లో థియేట‌ర్లుండటం వల్ల ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది. చిన్న సినిమాకి ధియేట‌ర్లు దొర‌కక‌పోవ‌డం అంటే దుర్మార్గం. చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు లభించేలా చూడాల్సిన బాధ్య‌త  ఫిలిం ఛాంబర్.. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్.. అలాగే ప్రభుత్వం మీదా ఉంది. క్రేజ్ క్యాష్ చేసుకోవ‌డం కోసం ఒకే సినిమాని అన్ని థియేట‌ర్లలో వేస్తున్నారు. చిన్న సినిమాల్ని పండ‌గ లేన‌ప్పుడు.. పెద్ద సినిమాలు లేన‌ప్పుడు చూసుకుని రిలీజ్ చేయాలా? స‌క్సెస్ ఫెయిల్యూర్ అనేది జ‌నం నిర్ణ‌యిస్తారు. ఇండ‌స్ట్రీ ఏ ఒక్క‌రిదో కాదు.. అంద‌రిదీ. చిన్న సినిమాల‌కు న్యాయం చేయ‌మ‌ని కోరుతున్నాను. మాకు వెయ్యో 2 వేలో థియేటర్లు అక్కర్లేదు. ఊరికి ఒక్క థియేటర్ ఇవ్వండి చాలు’’ అని నారాయణమూర్తి కోరారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News