బికినీ కోసం బాగానే కరిగించింది

Update: 2016-06-13 09:30 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కలిసి ఐటెం పాటలో ఆడి పాడింది రాయ్ లక్ష్మి. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఈమెకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఇప్పుడు భామ బాలీవుడ్ లో ఓ మూవీ కోసం తెగ కష్టపడిపోతున్నా అంటోంది. జూలీ2 చిత్రానికి గాను.. రాయ్ లక్ష్మి బాగానే ఒళ్లు వంచాల్సి వస్తోంది. కేరక్టర్ కోసం తన బాడీలో  బోలెడన్ని మార్పులు చేసుకుంటున్నట్లు చెబుతోంది.

'జూలీ2 లో మొదట నేను పక్కింటి అమ్మాయి పాత్రలో చాలా సింపుల్ గా కనిపిస్తాను. ఆ తర్వాత కొన్ని కిలోల బరువు పెరగాల్సి ఉంటుంది. పాత్రపరంగా కొంత వేరియేషన్ చూపించాలి. అందుకే 2 నెలల గ్యాప్ తీసుకుని బరువు పెరిగా. ఇప్పటికే పెరిగిన వెయిట్ పై తీసిన సీన్స్ పిక్చరైజేషన్ పూర్తయింది. ఇప్పుడు మూడో షెడ్యూల్ లో నేను అల్ట్రాగ్లామరస్ అవతారంలో కనిపించాలి. ఇందుకోసం మళ్లీ 2 నెలలు బ్రేక్ తీసుకుని 10 కిలోల బరువు తగ్గాను. బికినీ బాడీ అనేందుకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కదా' అంటోంది రాయ్ లక్ష్మీ.

ప్రస్తుతం జూలీ2 తప్ప వేరే ఈ సినిమాను చేయడం లేదీ భామ. జూలీ2 తనకు యాభయ్యో చిత్రమని.. దీనిపైనే ఫుల్లుగా ఫోకస్ పెట్టానని చెప్పిన రాయ్ లక్ష్మి.. మధ్యలో లారెన్స్ తో మొట్ట శివ కెట్ట శివ మాత్రమే చేశానని.. అది 2 రోజుల షూట్ కావడంతోనే అంగీకరించానని అంటోంది. ఇంతకీ.. ఇప్పటివరకూ చూపించిన గ్లామర్ తోనే చాలామందికి మాట రావడం లేదు.. ఇప్పుడు అల్ట్రా గ్లామరస్ అవతారం అంటే.. ఏం చూపిస్తుందో?
Tags:    

Similar News