ఎరోటిక్ హారరా?? చూస్తే నవ్వొస్తోంది

Update: 2016-08-16 12:34 GMT
క్యూట్ హీరోయిన్ గా కెరియర్ మొదలెట్టిన కన్నడ పిల్ల కృతి కర్భందా.. ఆ తరువాత తెలుగులో బొక్క బోర్లా పడింది. పవన్‌ కళ్యాణ్‌ తో తీన్మార్ లో క్యూట్ గా కనిపించి.. ఆ తరువాత రామ్ సరసన ఒంగోలు గిత్తలా బాగా హాటుగా కనిపించింది. చివరకు రామ్‌ చరణ్‌ చెల్లెలిగా మొన్ననే బ్రూస్ లీ లో అలరించింది. కాని తెలుగులో ఛాన్సులు మాత్రం రాలేదు.

అమ్మడు ఇప్పుడు ''రాజ్ రీబూట్'' అనే సినిమాతో ఏకంగా బాలీవుడ్లో అడుగు పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ హష్మీ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను విక్రమ్ భట్ తీశాడులే. అయితే ఈ సినిమా టీజర్ చూసి ఇదేదో బీభత్సమైన బ్లాక్ బస్టర్ అని ఎవరైనా అనుకుంటే మాత్రం.. ఇప్పుడు ట్రైలర్ చూశాక నవ్విపోతున్నారు. ఇప్పటివరకు మనం ఇండియన్ హారర్ సినిమాల్లో చూసిన సీన్లన్నీ ఈ సినిమా ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. అంతే కాదు.. సినిమా ప్లాట్ కూడా ఉత్తినే అర్ధమైపోతుంది. కేవలం కృతి కర్భందా అందాలను, లిప్ లాకులను - సెమీ న్యూడ్ లుక్కు ఏదైనా చూడాలనుకుంటే తప్పిస్తే.. అసలు కంటెంట్ లేనట్లు అనిపిస్తోంది. అందుకే ఈ సినిమాను ఎరోటిక్ థ్రిల్లర్ అంటూ ప్రొడ్యూసర్లు ప్రమోట్ చేస్తుంటే.. ఏమీ థ్రిల్లర్ సామీ అంటూ సినిమా లవ్వర్లు నవ్వుతున్నారు.

మరి బాలీవుడ్ లో కూడా కృతి కర్భందా పరిస్థితి అంతే సంగతులా? అబ్బే.. ఒక్క సినిమాతో అలా తేల్చేయలేంలే.
Full View

Tags:    

Similar News