భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని తమిళ వర్ధమాన సినీనటి రాధ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె భర్తకూడా పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ కావడం గమనార్హం. అయితే.. కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల్లో వాపసు తీసుకున్నట్టు సమాచారం. దానికి గల కారణం కూడా వెల్లడించిందట రాధ!
తన భర్త వసంత రాజ్ వేధిస్తున్నాడని, తగిన చర్యలు తీసుకోవాలని చెన్నైలోని విరుగంబాక్కం పోలీస్ స్టేషన్లో రాధ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ కంప్లైంట్లో.. తమది ప్రేమ వివాహమని, ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్టు పేర్కొన్నట్టు తెలిసింది.
అప్పట్నుంచి తామిద్దరం భార్యాభర్తల్లాగా కలిసి ఉంటున్నామని, ఆధార్ కార్డులో, బ్యాంకు ఖాతాలో భర్తగా ఆయన పేరు కూడా నమోదు చేయించారని తెలిపారట. ఇక, తన సంపదలో చాలా భాగం భర్తకు ఇచ్చానని తెలిపారు. ఆయన కారు కొనడానికి కూడా 4.5 లక్షలు ఇచ్చానని, అడిగినప్పుడల్లా వేలకు వేలు డబ్బులు ఇచ్చేదానన్ని కూడా ఫిర్యాదులో రాసుకొచ్చారట.
అయితే.. కొన్ని రోజులుగా తనను అనుమానిస్తూ అవమానిస్తున్నారని, మానసికంగా.. శారీరకంగా దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో.. భార్యాభర్తలు ఇద్దరినీ స్టేషనుకు రావాలని పోలీసులు సూచించగా.. ఎవరూ హాజరుకాలేదట. అయితే.. మర్నాడు స్టేషన్ కు వెళ్లిన రాధ కంప్లైంట్ వాపసు తీసుకున్నారట.
తన భర్త వసంతరాజ్ పోలీసుల సమక్షంలో క్షమాపణలు కోరాడని, జరిగిన ఘటనలకు విచారం వ్యక్తం చేశాడని చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా.. ఆయన ఉద్యోగోన్నతికి కూడా తన కంప్లైంట్ అడ్డుగా ఉందని, అందుకే.. వాపసు తీసుకుంటున్నానని రాధ చెప్పినట్టు తెలుస్తోంది.