తమిళ నటుడు - డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ పెద్ద తలకాయ అయిన రాధ రవి గురించి గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చిన్మయి విషయంలో రాధ రవి అతి ఉత్సాహంతో వ్యవహరించాడు అంటూ అంతా కూడా అంటున్నారు. ఇక చిన్మయి అయితే ఏకంగా ఆయన్ను చెడుగుడు ఆడేసుకుంటుంది. ఈ సమయంలోనే రవి మరింత వివాదంలో చిక్కుకునేలా నయనతారపై విమర్శలు చేశాడు. లేడీ సూపర్ స్టార్ అనేంత స్థాయి ఆమెకు లేదు అంటూనే ఇంకా పలు విమర్శలు ఆమెను చేయడం జరిగింది. దాంతో ఆయన సినీ కెరీర్ మరియు రాజకీయ కెరీర్ మొత్తం కూడా నాశనం అయ్యింది.
తన సినీ మరియు రాజకీయ కెరీర్ నాశనం అవ్వడంతో రాధ రవి మరింతగా ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఎవరిపై పడితే వారిపై విమర్శలు చేస్తూ ఇంకా వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా విశాల్ పై ఈయన కామెంట్స్ చేశాడు. విశాల్ కు ఏమీ తెలియకున్నా అన్ని విషయాల్లో నాకు తెలుసు అంటూ తల దూర్చుతాడు - నా పేరుకు ముందు ఉండే రాధను తొలగించుకోవాలని అన్నాడు.
రాధ అనేది నా తండ్రి పేరు అనే విషయం అతడికి తెలియదు. మరేదో ఉద్దేశ్యంతో నా పేరులోని రాధను తొలగించుకోవాలంటూ నన్ను ఆదేశించాడు. అతడి మాటలు తెలివి తక్కువ తనంను చూపుతున్నాయి. అతడు తనకు తెలియని విషయాల్లో కూడా తలదూర్చి అంతా తానే చేశాను అన్నట్లుగా వ్యవహరిస్తాడు అంటూ ఎద్దేవా చేశాడు. అయితే విశాల్ పై రాధ రవి చేసిన విమర్శలు సినీ వర్గాల్లో ఆయనపై మరింత కోపంను కలిగిస్తున్నాయి. రాధ రవి ఇకపై అయినా తన నోరును అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని కొందరు తమిళ సినీ వర్గాల వారు సూచిస్తున్నారు.