బాలీవుడ్ లో సల్మాన్ భాయ్ డేర్ డెవిల్ స్టెప్ గురించి తెలిసిందే. రాధే - మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రాన్ని ఓటీటీ సహా థియేటర్లలో సైమల్టేనియస్ గా రిలీజ్ చేశారు. పే-పర్ వ్యూ విధానాన్ని అనుసరించారు. కానీ భాయ్ సాహసం చేసినా ఆ ఫార్మాట్ పూర్తిగా ఫెయిలైంది. దీంతో అదే బాటను అనుసరించాలనుకున్న చాలా మంది ఆలోచనలు మారిపోయాయి.
ఇటీవల రాధే ఫార్మాట్ లోనే రాధేశ్యామ్ కూడా రిలీజైపోతుందని ప్రభాస్ అండ్ టీమ్ అందుకు సన్నాహకాల్లో ఉన్నారని తామరతంపరగా కథనాలొచ్చాయి. రాధేశ్యామ్ హైబ్రిడ్ విడుదలకు రెడీ అవుతోందనే వార్తలు వచ్చాయి. OTT లో పే-పర్ వ్యూతో పాటు విదేశాలలో పెద్ద స్క్రీన్లలోనూ విడుదలవుతుందని టాక్ వినిపించింది.
నిర్మాతలకు ఓటీటీ ల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ యువి క్రియేషన్స్ ప్రభాస్ అండ్ టీమ్ అటువంటి ప్రణాళికల్లో లేరు. పెద్ద స్క్రీన్ విడుదలను మాత్రమే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. రాధే శ్యామ్ పెద్ద స్క్రీన్లలో మాత్రమే చూడాల్సిన సినిమా.. అందుకే థియేటర్లు తెరిచే సరైన సమయం కోసం ఎంతకాలమైనా ఎదురుచూడాలని భావిస్తున్నారట.
నిజానికి రాధే ఫార్మాట్ ని మరో కోణంలోనూ కొందరు అభిమానులు విశ్లేషిస్తున్నారు. రాధే లో కంటెంట్ లేక ఫోయిలైంది. రాధేశ్యామ్ కంటెంట్ తో హిట్టు కొడుతుందేమో చెప్పలేం. రాధే ఫార్మాట్ రాధేకి కలిసి రాకపోయినా రాధేశ్యామ్ కి కలిసి రావొచ్చేమో!! థింక్ ట్వైస్ అని కొత్త డౌట్లు పెట్టేసే అభిమానులు లేకపోలేదు. ఈ రోజుల్లో కంటెంటే దేనినైనా నడిపిస్తోంది కదా! అని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ వాదాన్ని యువి బ్యానర్ పరిశీలిస్తుందేమో చూడాలి. ప్రభాస్ తదుపరి సలార్ - ఆదిపురుష్ 3డి చిత్రీకరణలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని త్వరలోనే ప్రారంభించే యోచన చేస్తున్నారు.