బాలీవుడ్ భాయ్ సల్మాన్ బాటలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డేర్ డెవిల్ ఫీట్ కి రెడీ అవుతున్నాడా? `రాధే - యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` తరహాలోనే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాని రిలీజ్ చేయనున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే సల్మాన్ భాయ్ నటించిన రాధే చిత్రాన్ని ఈద్ కానుకగా మే 13న చెప్పిన తేదీకే థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామని.. అదే రోజు ఓటీటీల్లో పే-పర్ వ్యూ విధానంలో సినిమా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అదే స్టైల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రాన్ని పే - పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తారని.. థియేట్రికల్ రిలీజ్ తో పాటు సైమల్టేనియస్ గా ఈ విధానం అందుబాటులోకి తెస్తున్నారని ప్రచారమవుతోంది.
అయితే ఇది నిజమా? అన్నది ప్రశ్నిస్తే.. చిత్రబృందం ససేమిరా అనేస్తోందిట. బాలీవుడ్ తరహా రిలీజ్ లు సౌత్ లో వర్కవుటవ్వవు అనే భావన ఉంది. అందుకే ఎట్టి పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ కోసమే వేచి చూస్తారట. జూలై 30న రాధేశ్యామ్ రిలీజ్ కి రావాల్సి ఉండగా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిందని కథనాలొచ్చాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కొంత పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంది.