రాధేశ్యామ్ టికెట్ ధ‌ర‌ల రేంజు ఇలా!

Update: 2022-03-06 07:30 GMT
సినిమా రేంజును బ‌ట్టి టికెట్ ధ‌ర‌ల్లో మార్పు ఉంటుందా?  పాన్ ఇండియా రేంజుకు ఒక ర‌కంగా .. లోక‌ల్ మార్కెట్ రేంజుకు ఇంకో ర‌కంగా టికెట్ ధ‌ర‌ల నిర్ణ‌యం ఉంటుందా? అంటే.. కొన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న కొర‌వ‌డింద‌నే చెప్పాలి.

ఆర్.ఆర్.ఆర్ - రాధేశ్యామ్ - కేజీఎఫ్ 2 లాంటి హై బ‌డ్జెట్ చిత్రాల‌కు పాన్ ఇండియా కేట‌గిరీ సినిమాల‌కు టికెట్ ధ‌ర‌లు వేరుగా ఉండాల‌ని బ‌డ్జెట్ల క‌నుగుణంగా ఈ మార్పు త‌ప్ప‌నిస‌రి అని నిర్మాత‌ల నుంచి డిమాండ్ ఉంది. అయితే దీనికి కొన్ని ప్ర‌భుత్వాలు అంగీక‌రిస్తున్నా ఏపీలో ప‌రిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.

ఇటీవ‌లి కాలంలో ఏపీలో స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తుల్లేవ్. అలాగే టికెట్ ధ‌ర‌లు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన మేర‌కే అమ్మాలి. టికెట్ రేటును పెంచినా బ్లాక్ లో అమ్మినా థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు బ‌డితె పూజ చేస్తోంది గ‌వ‌ర్న‌మెంట్.

ఏపీలో కొన్నిచోట్ల సింగిల్ స్క్రీన్ల‌కు రూ.10 నుంచి రూ.100 లోపు టికెట్ ధ‌ర‌లు ఉండ‌డంపై ఎగ్జిబిష‌న్ రంగం గుర్రుమీద ఉంది. కానీ అధికారులు మాత్రం దానిని క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మునుముందు రిలీజ్ కి రానున్న రాధేశ్యామ్.. ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాల ప‌రిస్థితేంటి? అన్న‌ది విశ్లేషిస్తున్నారు.

నిజానికి ఇవ‌న్నీ అత్యంత భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కాయి. టికెట్ ధ‌ర‌ల్ని హైదరాబాద్ సిటీ వ‌ర‌కూ చూస్తే.. సింగిల్ స్క్రీన్ లలో రాధేశ్యామ్ గరిష్ట టిక్కెట్ ధర రూ.175 . అలాగే మల్టీప్లెక్స్ లలో రూ.295 గా ఉంది. సింగిల్ స్క్రీన్ లో RTC X రోడ్ లలో ET (సూర్య హీరో) గరిష్ట టిక్కెట్ ధర రూ.175 కాగా..  మిగిలిన ధర రూ.150 గా ఉంది. మల్టీప్లెక్స్ లలో గరిష్ట ధర రూ.250 వ‌ర‌కూ ఉంది. ఇటి కూడా పాన్ ఇండియా కేట‌గిరీలో త‌మిళం-తెలుగు స‌హా ఇత‌ర భాష‌ల్లో విడుద‌లవుతోంది.

మార్చి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ ప్రీమియర్ లను వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారిక నిర్ధారణ వచ్చే అవకాశం ఉందని గుస‌గుస వినిపిస్తోంది. అయితే ఈ ప్రీమియ‌ర్లు స్పెష‌ల్ షోల‌కు నైజాంలో ఎలాంటి అడ్డుంకులు లేవు.

ఏపీలో అనుమ‌తులు ల‌భిస్తాయా? అన్న‌ది వేచి చూడాలి. కేవ‌లం జ‌న‌సేన అధినాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కూ మిన‌హాయించి ఇత‌ర హీరోల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంద‌ని కూడా ఒక సెక్ష‌న్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి మునుముందు ప‌రిణామాలు ఎలా ఉండ‌నున్నాయో వేచి చూడాలి.
Tags:    

Similar News