రాధిక కూతురితో క్రికెటర్ పెళ్లి సందడి!

Update: 2016-08-29 07:48 GMT
తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా రాధిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగాస్టార్ తో జంటగా అత్యధిక సినిమాల్లో నటించిన రాధిక.. తర్వాత తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. అనంతరం బుల్లి తెర సీరియల్స్ తీస్తూ - నటిస్తూ - తమిళ హీరో శరత్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా రాధికా శరత్‌ కుమార్ కూతురు రయానే - మిథున్ ల వివాహ వేడుక చెన్నైలోని మహాబలిపురంలో జరిగింది. క్రికెటర్ అభిమన్యు మిథున్‌ తో రయాన్ కు జరిగిన ఈ వివాహ వేడుకకు తెలుగు - తమిళ - కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత - ఆమె స్నేహితురాలు శశికళ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. నిర్మాత ఏఎం శరవణన్‌ - దర్శకులు శంకర్‌ - భారతిరాజా - కస్తూరిరాజా - బాలాజీ మోహన్‌ హాజరయ్యారు. ఇక దంపతులుగా సుహాసిని- మణిరత్నం - రాంకి- నిరోషా - భాగ్యరాజ్‌- పూర్ణిమ - సూర్య- జ్యోతిక దంపతులు హాజరై సందడి చేశారు.

చిరంజీవితో పాటూ ప్రభు - సత్యరాజ్‌ - చియాన్ విక్రం - విజయ్‌ - శివకార్తికేయన్‌ - పునీత్‌ రాజ్‌కుమార్‌ - హీరోయిన్స్ మీనా - రాధ - అంబిక - అర్చన - ఎడిటర్‌ మోహన్‌ - లిరిసిస్ట్ వైరముత్తు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.

కాగా, ఇంగ్లాండ్ లోని లిట్స్ యూనివర్శిటీలో క్రీడారంగం విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రెయాన్.. ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. క్రికెటర్ మిథున్‌ ఐపీఎల్‌ ఆడటంతోపాటూ భారత జట్టు తరపున 4 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.
Tags:    

Similar News