ప్రపంచం కళ్లన్నీ అంబానీల ఇంట పెళ్లిపైనే! ఆ ఇంట వరుస పెళ్లిళ్లతో డోలు బాజా మోగుతోంది. ఇదివరకూ అంబానీ కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి కోసం ఏకంగా 700కోట్లు ఖర్చు చేసిన అంబానీ నేడు ముంబై- జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన కుమారుడు ఆకాష్ పెళ్లి కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారని ప్రచారం సాగుతోంది. ముంబై - కుర్లా కాంప్లెక్స్ నుంచి జియో సెంటర్ వరకూ నేడు అన్ని రంగాల సెలబ్రిటీలతో నిండిపోయింది. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడా రంగ ప్రముఖులు సహా ఇతరత్రా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి ఎటెండ్ అయ్యారు.
ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీల సందడి ప్రత్యేకమైన గ్లామర్ ని తెచ్చింది. అయితే ఇదే పెళ్లిలో మరో విషయం గురించి సెలబ్రిటీలు సహా ప్రముఖులంతా ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఓవైపు పెద్ద కొడుకు పెళ్లి వేడుక జరుగుతుండగానే ఇదే పెళ్లి సందడిలో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి కాబోయే పిల్లపైనా అందరి దృష్టి పడింది. ఈ పెళ్లిలో అంబానీ కి కాబోయే చిన్న కోడలు రాధిక సందడి అంతా ఇంతా కాదు. కాబోయే అత్తమామలతో కలిసి వేదిక ఆద్యంతం రాధిక సందడి కనిపించింది.
అనంత్ - రాధిక జంట చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. తొందర్లోనే ఈ జంటకు కూడా పెళ్లి చేసేస్తారన్న ముచ్చటా అతిధుల్లో సాగింది. ఆకాష్ అంబానీ- శ్లోకా మెహతా పెళ్లి తో పాటు అనంత్ - రాధిక జంట యాక్టివిటీస్ పైనా బాలీవుడ్ మీడియా ప్రత్యేకంగా కన్నేసి ఉంచడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిపోతున్నాయి. ఇండియాలో మరో భారీ కలర్ ఫుల్ వెడ్డింగ్ కి ఈ పెళ్లిలోనే క్లారిటీ వచ్చేసింది. ఇక చిన్న కోడలు రాధిక సాంప్రదాయబద్ధమైన డిజైనర్ లెహెంగాలో తళుకులీనింది. ఆరెంజ్ కలర్ లెహంగాలో రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ డిజైనర్ డ్రెస్ కోసం అంబానీలు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసి ఉంటారన్న ముచ్చటా మగువల్లో సాగింది. ఈ పెళ్లిలో అంబానీల కుటుంబ సభ్యులు బంగారు వజ్రాభరణాలతో డిజైన్ చేసిన డ్రెస్సుల్లో తళతళలాడారు. ఈ పెళ్లి షాపింగ్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేసి ఉంటారన్న ముచ్చటా అక్కడ సాగింది.