సీనియర్ హీరోయిన్ రాధికను ఎప్పుడైనా మనం తమిళమ్మాయి లాగా భావించామా? ఆమె ఇక్కడ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అయింది. ఆమెను మన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు. ఆమె తీసిన సీరియళ్లను కూడా ఆదరించాం. ఇప్పటికీ మన ఆడ పడుచు లాగే భావిస్తాం. ఏ రోజూ తమిళ హీరోయిన్ అని చిన్నచూపు చూడలేదు. కానీ రాధిక మాత్రం తమిళనాట ఇప్పుడు వేర్పాటు వాదంతో విషం చిమ్మే మాటలు మాట్లాడుతోంది. తమిళనాట స్థానికేతరుల ప్రాబల్యం పెరిగిపోతోందని.. వాళ్లనెందుకు మనం నెత్తిన పెట్టుకోవాలని.. మహారాష్ట్రలో ఎంఎఎన్ ఎస్ అధినేత రాజ్ ఠాకూర్ తరహాలో మాట్లాడుతోంది.
ఎంజీఆర్.. జయలలిత.. రజనీకాంత్.. వైగో.. విజయ్ కాంత్ వంటి నేతలంతా స్థానికేతరులేనని... వీరిని ఆదరించాల్సిన అవసరం తమిళులకు లేదని రాధిక తేల్చేశారు. పనిలో పనిగా తన భర్త శరత్ కుమార్ కు బద్ధ శత్రువైన విశాల్ ను కూడా రాధిక టార్గెట్ చేసింది. విశాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడని.. నడిగర్ సంఘంలోని ఇంకొందరు నేతలు కూడా ఎక్కడి నుంచి వచ్చారో ఆలోచించాలని రాధిక పేర్కొంది. జయలలిత.. రజినీకాంత్ తమిళులు కాకున్నా ఇక్కడ రాజ్యమేలారని.. ఏలుతున్నారని రాధిక విమర్శించింది. ఓవైపు సినిమాల్లో.. మరోవైపు రాజకీయాల్లో శరత్.. రాధిక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ అసహనమే విధ్వేషంగా మారిందని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/