కనిపించే దైవానికి గుడి కట్టిన లారెన్స్

Update: 2017-02-22 09:45 GMT
డ్యాన్సర్ నుంచి హీరోగా, దర్శకుడిగా ఎదిగిన రాఘవ లారెన్స్ తన తల్లికి కట్టిస్తున్న గుడిలో ఆమె విగ్రహ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది.  తమిళనాడులోని అంబత్తూరులో కొన్నేళ్ల క్రితం లారెన్స్ రాఘవేంద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు అదే ప్రాంగణంలో తన తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు.  ఇందుకోసం తన తల్లి కన్మణి విగ్రహాన్ని రాజస్థాన్‌ లో  5 అడుగుల పాలరాతి విగ్రహం చేయించారు.     కాగా మార్చి నెలలో తమిళ ఉగాది రోజున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు లారెన్స్ మంగళవారం ప్రకటించారు. 13 అడుగుల గాయత్రీ దేవి విగ్రహం... ఆ దిగువన కన్మణి విగ్రహాన్ని నిలుపుతున్నారు.  
    
కనిపించే దైవమైన అమ్మకు జీవించి ఉండగానే గుడి కట్టాలని లారెన్స్ గతంలోనే అనుకున్నారు 2014లోనే ఆయన దీనికి సంబంధించి ప్రకటన చేశారు. గత ఏడాదే దీన్ని ప్రారంభించాలని అనుకున్నా విగ్రహం సిద్ధం కాకపోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం విగ్రహం సిద్ధం కావడంతో దాన్ని ప్రతిష్ఠించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  తన తల్లి గొప్పదనాన్ని తెలియజెప్పేలా  ఒక పుస్తకం కూడా రాస్తున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News