20 కోట్లు అడుగుతున్న లారెన్స్

Update: 2015-10-27 13:30 GMT
డిమాండ్ ఉంటే ఇరవై ఏంటి.. యాభై కోట్లయినా డిమాండ్ చేయొచ్చు. లారెన్స్ తీస్తున్న హార్రర్ సినిమాలు ఆ రేంజిలో లాభాలు తెచ్చిపెడుతున్నాయి మరి. కాంచన సినిమా బెల్లంకొండకు పది కోట్లకు పైనే మిగిల్చింది. తాజాగా ‘గంగ’ కూడా పాతిక కోట్ల దాకా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ లో వస్తున్న కొత్త సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

డిమాండుకు తగ్గట్లే తెలుగు రైట్స్ అమ్మడానికి చూస్తున్నాడు లారెన్స్. ఇంతకుముందులా ఫైనాన్స్ కోసం బెల్లంకొండ మీద ఆధారపడట్లేదు అతను. గంగ (కాంఛన-2) రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో తర్వాతి సినిమాకు సొంతంగా కావాల్సినంత ఫైనాన్స్ రాబట్టుకున్నాడు లారెన్స్. దీంతో ఎవరు ఎక్కువిస్తే వాళ్లకు ముని-4 తెలుగు వెర్షన్ అమ్మడానికి చూస్తున్నాడు లారెన్స్.

తమిళంలో నాగ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘భైరవ’ పేరుతో విడుదల చేస్తారు. కాజల్ కథానాయిక. ప్రస్తుతానికి లారెన్స్ రూ.20 కోట్లు అడుగుతున్నాడు. మరీ లేటై.. రిలీజ్ సమయానికి వస్తే ఇంకా రేటు పెరిగే అవకాశాలున్నాయి. ఐతే లారెన్స్ హార్రర్ సిరీస్ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే అది మరీ పెద్ద ఫిగరేమీ కాదు.
Tags:    

Similar News