నేను ఆ పని చేయడం తప్పే

Update: 2019-04-15 07:45 GMT
తెలుగు మరియు తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాఘవ లారెన్స్‌ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కొరియోగ్రాఫర్‌ గా కెరీర్‌ ను ఆరంభించిన లారెన్స్‌ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ కొరియోగ్రాఫర్‌ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత లారెన్స్‌ లో మెల్ల మెల్లగా కోరికలు పెరిగాయి. నటుడిగా మారాలనుకుని ఏకంగా హీరో అయ్యాడు. ఆ తర్వాత చిన్న సినిమాలకు డైరెక్షన్‌ చేయాలనుకుని ఏకంగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేశాడు. ఆ సమయంలోనే లారెన్స్‌ లో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ మొదలైనట్లుంది. అందుకే మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా కూడా ప్రయత్నించాడు.

డాన్‌, రెబల్‌ వంటి పెద్ద స్టార్స్‌ సినిమాకు లారెన్స్‌ సంగీతాన్ని అందించడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. రాగాలు తెలిసిన నేను సంగీత దర్శకుడిగా మారితే తప్పేంటి అనుకుని ఆ రెండు సినిమాలకు సంగీత దర్శకుడిగా మారాను - కాని సంగీతంలో రాగాలు మాత్రమే కాదు - ఇంకా చాలా ఉంటుంది - అదో పెద్ద సముద్రం అని తర్వాత తెలిసింది. అందుకే తనకు తెలియని పనిని మళ్లీ చేయవద్దని నిర్ణయించుకున్నాను. అప్పటి నుండి మళ్లీ సంగీతం జోలికి వెళ్లలేదు. ఆ రెండు సినిమాలకు సంగీతం చేసే తప్పు చేశానని అనిపిస్తుంది. దర్శకత్వం గురించి పెద్దగా తెలియకున్నా దర్శకత్వం చేయవచ్చు, కాని సంగీతం అలా కాదని ఆ తర్వాతే నాకు అర్థం అయ్యింది. భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు కూడా సంగీతం మాట ఎత్తను అంటూ లారెన్స్‌ చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈయన నటించిన కాంచన 3 చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మ్యూజిక్‌ డైరెక్షన్‌ గురించి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు. ఇక కాంచన 3 చిత్రం గతంలో తన దర్శకత్వంలో వచ్చిన ముని సిరీస్‌ సినిమాల్లో అన్నిటిని బీట్‌ చేసే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News