లారెన్స్ కు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన 'ముని' సిరీస్ సినిమాలను వదిలి పెట్టడం లేదు. ముని, కాంచన, గంగా ఇలా పలు పేర్లతో లారెన్స్ హర్రర్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ లను దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే సిరీస్ లో 'కాంచన 3' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం విడుదలకు అంతా సిద్దం అయ్యింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్ పూర్తి అయిన తర్వాత సినిమా పూర్తి నడివి 2 గంటల 55 నిమిషాలు అని వెళ్లడయ్యింది. ఈమద్య కాలంలో సినిమాలు రెండు లేదా రెండున్నర గంటలకు ఎక్కువ ఉండటం లేదు. మరి కాంచన 3 ని మూడు గంటల నిడివితో విడుదల చేయడం ఏంటని అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సాదారణంగా హర్రర్ సినిమాలు రెండు గంటలకు మించి ఉంటే చూడటం కష్టం. అలాంటిది ఏకంగా మూడు గంటల పాటు తన హర్రర్ సీన్స్ తో లారెన్స్ మెప్పిస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటి వరకు వచ్చిన లారెన్స్ ముని సిరీస్ సినిమాలు ఏవీ కూడా రెండున్నర గంటలు మించలేదు. కాని ఈసారి మాత్రం మూడు గంటల సినిమాతో రానున్నాడు. మొదటి నుండి కూడా లారెన్స్ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. తాను గతంలో చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా మరింత ఎక్కువ భయపెడుతుందని చెబుతున్నాడు.
ఎక్కువ భయపెడుతుందని చెప్తే మరింత హర్రర్ ఉంటుందని భావించాం కాని, ఇలా ఎక్కువ సేపు భయపెట్టే ప్లాన్ చేస్తున్నాడా అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 'కాంచన 3' పై లారెన్స్ కు కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుందని, లెంగ్త్ ఎక్కువ అయిన సినిమాలు ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతుంటాయి. బాహుబలి - రంగస్థలం వంటి చిత్రాలు మాత్రమే టైం ఎక్కువ ఉన్నా కూడా ప్రేక్షకులు చూస్తారు. లారెన్స్ నమ్మకం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈనెల 19న తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడులో కూడా కాంచన 3 చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.