'కాంచ‌న' సిరీస్ లో 10 సినిమాలు

Update: 2019-03-28 12:16 GMT
ఇంట‌ర్వ్యూల వేళ ఒక్కొక్క‌రి శైలి ఒక్కోలా ఉంటుంది. ఎదుటివారు అడిగే ప్ర‌శ్న‌కు వెంట‌నే విన‌మ్రంగా స‌మాధానాలిచ్చే వాళ్లు కొంద‌రు అనుకుంటే.. అలా కాకుండా తిర‌కాసు పెట్టి జ‌వాబు చెప్ప‌కుండా త‌ప్పించుకునే వాళ్లు ఇంకొంద‌రు. ఈ జాబితాలో వివాదాల రామ్ గోపాల్ వ‌ర్మ అగ్ర‌గ‌ణ్యుడు. త‌న‌ని ఎవ‌రైనా ఏదైనా ప్ర‌శ్న అడిగితే దానికి డొంక తిరుగుడుగా స‌మాధానం ఇవ్వ‌డం ఆయ‌న‌కే చెల్లింది. త‌న‌కు అర్థం కాని - లేదా త‌న‌ని విసిగించే క‌న్ఫ్యూజ్ చేసే ఏదేనా ప్ర‌శ్న త‌న‌పై సంధిస్తే వెంట‌నే ఆర్జీవీ స్పందించే  తీరు అనూహ్యంగా  ఉంటుంది. తాను ఇచ్చిన స‌మాధానం ఎదుటివారికి అస్స‌లు అర్థం కాకుండా చెప్ప‌డం అత‌డి స్టైల్. మ‌నిషి సైకాల‌జీ - ఫిలాస‌ఫీపై ప‌ది పీహెచ్‌ డీలు పుచ్చుకున్న ఆర్జీవీ ఈ మ‌నిషి ప్ర‌పంచాన్ని హ్యాండిల్ చేసే విధాన‌మే వేరు.

ఏటికి ఎదురెళ్ల‌డం.. అడ్డ‌గోలుగా వాదించ‌డంలోనూ ఆర్జీవీ స్పెష‌లిస్ట్. అందుకే అత‌డు ఇదీ ఎన్టీఆర్ అస‌లు క‌థ అంటూ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీయ‌గ‌లిగారు. చంద్ర‌బాబు- ఎన్‌ బీకే బృందం ఓ వైపు ధుమ‌ధుమ లాడుతూ లోలోన మ‌రిగిపోతూ ఉన్నా ఎట్ట‌కేల‌కు ఆ సినిమా రిలీజైపోతోంది. ఇప్ప‌టికే ప్రివ్యూల నుంచి టాక్ కూడా లీకైంది. ఈ సినిమాలో ఎక్క‌డా న‌స పెట్ట‌కుండా సూటిగా పాయింట్ కొచ్చేశాడు ఆర్జీవీ. ఉన్న‌ది ఉన్న‌ట్టు చూపించేశాడ‌ని మాట్లాడుకుంటున్నారు. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియో స్ లో వేసిన సెల‌బ్రిటీ షోలో ల‌క్ష్మీ పార్వ‌తి స‌హా ప‌లువురు పాత్రికేయులు ఈ సినిమాని వీక్షించారు. ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో తాను ఏం చెప్ప‌ద‌లిచాడో - ఏం చూప‌ద‌లిచాడో ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌కుండా చూపించేశార‌ట‌. తొలి నుంచి చెబుతున్న‌ట్టే చంద్ర బాబును ప‌క్కా విల‌న్ గా చూప‌డంలో ఆర్జీవీ ప‌నిత‌నం తెర‌పై క‌నిపించింద‌ట‌.

ఇక‌పోతే ఆర్జీవీ పూనాడో ఏమో కానీ - నేడు కాంచ‌న 3 ట్రైల‌ర్ ఈవెంట్  వేళ‌ మీడియా స‌మావేశంలో మాట్లాడిన లారెన్స్ సైతం ఆర్జీవీ లానే స్పందించాడ‌ట‌. మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌రైన ఆన్స‌ర్ ఇవ్వ‌కుండా తెర‌పై చూడండి.. సినిమాలో చూడండి! అంటూ స‌రిపుచ్చాడు. ఇక కాంచ‌న 3 లో మునుప‌టి రెండు భాగాల్ని మించి హార‌ర్ టెర్ర‌ర్ భ‌య‌పెట్టేస్తుంద‌ని లారెన్స్ చెప్పారు. ఇక‌పోతే ట్రైల‌ర్ చూసిన‌వాళ్లంతా ఇది కూడా రొటీన్ దెయ్యమే. ఇందులో ఏం కొత్త‌గా చూపించ‌లేదు! అంటూ పెద‌వి విరిచేశారు. ఫ‌క్తు మాస్ మసాలా ఫార్ములాతో తీసిన సినిమా ఇద‌ని అర్థ‌మైపోయింది అంటూ చెవులు కొరుక్కున్నారు. అయితే లారెన్స్ మాస్టార్ రొటీన్ గా తీసినా హిట్టు కొట్టి స‌ర్ ప్రైజ్ చేస్తాడో.. లేక కొత్త‌గా ఏదైనా చూపించి మ్యాజిక్ చేస్తాడో అన్న‌ది కాస్త రిలీజ్ వ‌ర‌కూ ఆగితే కానీ తెలీదు. ఇక‌పోతే ఈ సినిమా హిట్ట‌యితే ఏకంగా ఈ సిరీస్ లో 10 సినిమాలు తీస్తాడ‌ట మ‌నోడు!
Tags:    

Similar News