జల్లికట్టు పోరాటానికి లారెన్స్ మద్దతిది!

Update: 2017-01-19 09:28 GMT
జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తించాలంటూ నిర్వ‌హిస్తున్న పోరాటానికి న‌టుడు, ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ మ‌ద్ద‌తు తెలిపాడు. మెరీనా బీచ్‌లో పోరాడుతున్న విద్యార్థుల ఆక‌లిద‌ప్పులు తీర్చ‌డానికి అవ‌స‌ర‌మైతే తాను కోటి రూపాయలు ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌మ‌ని వెల్ల‌డించాడు. విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు మెరీనా బీచ్ వెళ్లిన రాఘ‌వ ఆవేశంగా మాట్లాడాడు. ఆందోళ‌న‌లో పాల్గొని విద్యార్థుల‌తో క‌లిసి తానూ నినాదాలు చేశాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... జ‌ల్లిక‌ట్టు త‌మిళుంద‌రినీ ఒక్క‌తాటిపైకి తెచ్చిందని అభిప్రాయపడ్డాడు.

"త‌మిళులంతా ఒక్క‌ట‌య్యాం.. ఇదే సగం విజ‌యం.. తోటి న‌టీన‌టులంతా ఈ పోరాటానికి మ‌ద్ద‌తు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ పోరాటంలో పాల్గొన్న‌వారికి భోజ‌నమేకాదు - క‌నీసం మంచినీళ్లు కూడా దొర‌క‌డం లేద‌ని నాకు ఒక సందేశం వ‌చ్చింది.. అది చూసి చాలా బాధ‌ప‌డ్డాను.. ఇటీవ‌ల వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు రాష్ట్రప్ర‌జలంతా ఏక‌మై సాయం చేశాం.. అలాగే ఈ పోరాటానికీ అంతా చేయూత‌నిద్దాం.. జ‌ల్లిక‌ట్టు త‌మిళ సంప్ర‌దాయానికి అద్దంప‌ట్టే క్రీడ‌.. దాన్ని జ‌రుపుకోకుండా అడ్డుప‌డే విదేశీ శ‌క్తుల‌ను అడ్డుకోవాలి.. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా జ‌ల్లిక‌ట్టును జ‌ర‌పాల‌ని తీర్మానం చేయ‌డం అభినంద‌నీయం.. ఇక కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే మిగిలింది.. విద్యార్థుల పోరాటాన్ని చూసిన త‌ర‌వాతైనా కేంద్రం దిగొస్తే మంచిది" అని రాఘవ లారెన్స్ అనర్గలంగా మాట్లాడాడు!

మ‌రోప‌క్క‌... జల్లిక‌ట్టు పోరాటానికి ఐటీ మ‌ద్ద‌తు కూడా ల‌భించింది. రాష్ట్రంలోని వెయ్యి మందికి పైగా ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి చెన్నైలోని మెరీనా బీచ్ లో విద్యార్ధులు చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News