కుర్ర హీరోకు తనకే తెలియనన్ని యాంగిల్స్ చెప్పిన సీనియర్ దర్శకుడు

Update: 2020-01-31 06:30 GMT
సినిమా రంగంలో పొగడ్త చాలా కామన్. ఎంతలా పొగిడే అంతలా మనసు దోచేయటం ఖాయం. పొగడ్తకు ఉన్నంత పవర్ ఎలాంటిదన్న విషయాన్ని సినిమా ఇండస్ట్రీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ విషయంలో జూనియర్ల నుంచి సీనియర్ల వరకూ అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఆ మధ్య వరకూ వేదిక మీద మైకు పుచ్చుకొని మాట్లాడే అలవాటు లేని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ఈ మధ్యన తన తీరును పూర్తిగా మార్చుకున్నారు.

మైకు ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడటమే కాదు.. తన మాదిరి పొగడ్తలతో ఉక్కిరిబిక్కిరి ఎవరూ చేయలేరన్న రీతిలో సవాలు విసురుతున్నారు. తాజాగా కుర్రహీరో నాగశౌర్య నటించిన అశ్వత్థామ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్రరావు ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

కుర్రహీరో నాగశౌర్య కు సైతం తనలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా? అన్న సందేహం కలిగేలా రాఘవేంద్రరావు వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తాను చిన్న సినిమాలు చూస్తానని.. ఇండస్ట్రీ లో అడుగు పెడుతున్న కొత్త దర్శకులు.. సాంకేతిక నిపుణుల పని తీరును గమనిస్తానన్న ఆయన.. కొత్తగా వస్తున్న వారు చాలామంచి సినిమాలు తీస్తున్నారని చెప్పారు.

హీరో నాగశౌర్య ఎలాంటి పాత్రనైనా చేస్తారన్నారు. ఊహలు గుసగుసలాడే.. ఛలో సినిమాల్లో తన కన్ను అతడి పై పడిందన్న రాఘవేంద్రరావు.. గడ్డం తీస్తే క్లాస్ గా ఉండే నాగశౌర్య.. గడ్డం ఉంటే ఫైటర్ గా ఉంటారన్నారు. కీరిటం పెడితే కృష్ణుడిలా.. క్యాప్ పెడితే కౌబాయ్ లా ఉంటాడని పొగడ్తలతో పిసికేశారు. ఒక సీనియర్ దర్శకుడు ఇంతలా పొగిడేయటమే కాదు.. తనలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా? అని నాగశౌర్య అనుకునేలా దర్శకుడు రాఘవేంద్రరావు తీరు ఉందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News