దర్శకేంద్రుడు.. ఎన్టీఆర్.. నో??

Update: 2017-03-24 17:11 GMT
తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితంపై బయోపిక్ తెరకెక్కిస్తానని.. ఇప్పటికే కసరత్తులు తీవ్రం చేసేశారు. తనే తండ్రి పాత్రలో నటించబోతున్నానని కూడా ఒకానొక సమయంలో చూచాయగా చెప్పారు బాలయ్య. ఇప్పుడా ప్రాజెక్టుకు స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని.. దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

మొదట ఎన్టీఆర్ బయోపిక్ ను తనే దర్శకత్వం వహించాలని భావించిన బాలకృష్ణ.. నటన-దర్శకత్వం రెండూ చేస్తే న్యాయం చేయలేనని అనుకుంటున్నారట. అందుకే డైరెక్టర్ ను అన్వేషిస్తూ.. ఆ బాధ్యతలు చేపట్టాల్సిందిగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును కోరినట్లు టాలీవుడ్ టాక్. అయితే.. ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారట. అంతటి మహనీయుడి చరిత్రను తెరకెక్కించే బాధ్యత కొత్తవారికి ఇవ్వడం ఇష్టం లేని బాలయ్య.. సీనియర్ దర్శకుడికి అప్పగించాలనే ఉద్దేశ్యంతోనే దర్శకేంద్రుడిని కోరారని అంటున్నారు.

ఎన్టీఆర్ తో సినిమాలు తీసి.. ఇప్పటికీ తీస్తున్న అత్యంత అనుభవుజ్ఞులైన దర్శకులు కె. రాఘవేంద్రరావు.. దాసరి నారాయణరావు మాత్రమే. అయితే.. ప్రస్తుతం  దర్శకరత్న ఆరోగ్యం నిలకడగా లేదు. పైగా కొన్ని నెలలుగా బెడ్ రెస్ట్ లోనే ఉన్నారు. ఇప్పుడు రాఘవేంద్రరావు ఈ ప్రపోజల్ ను తిరస్కరించడంతో.. ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనే ఆసక్తి కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News