కొత్త కొత్త భాష.. కొత్త ప్రేమ భాష.. అంటూ కాస్త జిగరైన గొంతుతో ఓ చిన్నపిల్లాడు ఇరగదీశాడు. అదరగొట్టేశాడు. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ బుడతడు ఎవరో కాదు.. మన ఏ.ఆర్.రెహ్మాన్ కొడుకు అమీన్. పదండి ఓ లుక్కేద్దాం.
తెలుగులో తొలిసారిగా రెహ్మాన్ కొడుకు అమీన్ పాట పాడుతున్నాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. శ్రీకాంత్ తనయుడు రోషన్.. బాల నటి 'జై చిరంజీవా' ఫేం శ్రీయ శర్మ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రోషన్ సాలూరు. కొత్త కొత్త బాష అంటూ సాగే పాటను ఈరోజే విడుదల చేశారు. అమీన్ నిజంగా చాలా చక్కగా పాడేశాడు. బహుశా లెజండరీ సంగీత దర్శకుడు కొడుకు కాబట్టి ఖచ్చితంగా దుమ్ము లేపేస్తాడని అందరూ అనుకొని ఉండొచ్చు.. కాబట్టి వారి అంచనాలకు ఎక్కడా తగ్గలేదు.
మరి ఈ సినిమాలోని మిగిలిన పాటల సంగతేంటి? త్వరలోనే అక్కినేని నాగార్జున ఆ వివరాలను వెల్లడిస్తారట.