ఆ హీరో కొడుకు కోసం అతడి గొంతు

Update: 2016-02-11 15:30 GMT
ఓకే బంగారం సినిమాలో మౌలా వా సలీమ్.. అంటూ ఓ చిన్నారి మధుర స్వరం సంగీత ప్రియుల్ని మైమరిచిపోయేలా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ వాయిస్ ఎవరిదని చాలామందికి తెలియదు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కొడుకు ఏఆర్ అమీన్ ఆ పాట పాడటం విశేషం. చిన్న వయసులోనే అద్భుతమైన గానంతో పిట్ట కొంచెం కూత ఘనం అని రుజువు చేసిన అమీన్.. తాజాగా తెలుగులో ఓ స్పెషల్ మూవీకి తన గాత్రాన్ని అందిస్తున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నాగార్జున నిర్మాణంలో ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అమీన్ ఓ పాట పాడుతుండటం విశేషం. ‘ఓకే బంగారం’తో తన సింగింగ్ టాలెంట్ రుచి చూపించిన అమీన్.. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సింగర్ అవతారమెత్తుతున్నాడు. తన తొలి పాట పాడే సమయానికి ఇప్పటికీ అతడి వాయిస్ లో కొంచెం మార్పు వచ్చింది. శ్రీకాంత్ తనయుడు కూడా టీనేజ్ లో ఉన్న నేపథ్యంలో అతడికి అమీన్ వాయిస్ పర్ఫెక్ట్ గా సూటవుతుందని అనుకుంటున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’కు సంగీతాన్నందిస్తుండటం విశేషం. కోటి దగ్గర ఒకప్పుడు రెహమాన్ అసిస్టెంటుగా పని చేయగా.. ఇప్పుడు ఆయన కొడుకు సంగీతంలో రెహమాన్ తనయుడు పాట పాట పాడుతుండటం విశేషం. నాగార్జున ఫిలిం స్కూల్లో శిక్షణ తీసుకున్న నాగకోటేశ్వరరావు ‘నిర్మలా కాన్వెంట్’ను రూపొందిస్తున్నాడు. ఇందులో నాగ్ కూడా ఓ అతిథి పాత్ర పోషిస్తుండటం విశేషం.
Tags:    

Similar News