'దంగల్' లో మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ పాత్రల మధ్య వేరియేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక పాత్రలో మల్లయోధుడిగా మెప్పంచిన వైనం థియేటర్లో చప్పట్లు కొట్టించింది. యువకుడి పాత్రలో అమీర్ ఒదిగిన విధానం శెభాష్ అనిపించింది. ఇక వయసు ముదిరిన పాత్రలోనూ అమీర్ నటన అంతే అద్భుతం.
ఒకే పాత్రలో రెండు రకాల వేరియషన్స్ చూపించడం అమీర్ కి మాత్రమే సాధ్యమని నిరూపించిన సినిమా అది. అందుకే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన చిత్రంగా నిలిచింది. అయితే తెరపై అమీర్ ని ఇలా ఆవిష్కరించడం వెనుక ట్రైనర్ రాహుల్ భట్ కృషి ఎంతో ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే అమీర్ శిక్షణ పొందాడు.
కొన్ని నెలలు పాటు రాహుల్ తో ప్రయాణం చేయడంతోనే తెరపై అంత అద్భుతమైన పాత్ర పండింది. సినిమా మొదలు కొన్ని నెలల ముందు నుంచే ట్రైనింగ్ మొదలైంది. అటుపై షూటింగ్ పూర్తయ్యే వరకూ అమీర్ వెంటనే ఉన్నాడు.
అందుకే ఇప్పుడు అమీర్ లా సిక్స్ ప్యాక్ బాడీ సహా ట్రైనింగ్ కోసం యంగ్ హీరో కార్తిక్ ఆర్యనే ఏకంగా రాహుల్ భట్నే తన ట్రైనర్ గా ఏర్పాటు చేసుకున్నాడు.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కార్తీక్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ ట్రైనర్ వద్ద బాక్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసాడు. కానీ అతని ఇచ్చిన పంచ్ పవర్ సరిపోలేదు. కఠోర మైన శిక్షణ అవసరం అని దర్శకుడు సూచించడంతో ఆర్యన్ ఏకంగా 'దంగల్' ట్రైనర్ నే దించేసినట్లు తెలుస్తోంది.
దీని కోసం రాజ్కోట్ లో రాహుల్ భట్ వద్ద ప్రత్యేకంగా వ్యక్తిగత శిక్షణ తీసుకుంటున్నాడుట. ఉదయం రెండు గంటలు...సాయంత్రం మూడు గంటల పాటు శిక్షణ ఇస్తున్నారుట. బాక్సింగ్ కి సంబంధించిన ఎక్విప్ మెంట్స్ మొత్తం రాహుల్ భట్ విదేశాల నుంచి కొనుగోలు చేసారుట. కబీర్ ఖాన్ సినిమా పూర్తయ్యే వరకూ తనతో పాటే ఉండాలని రాహుల్ భట్ తో యువ హీరో అగ్రిమెంట్ చేసుకున్నాడుట. అలాగే కార్తీక్ ఆర్యన్ 'సత్యప్రేమ్ కి' అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే కబీర్ ఖాన్ సినిమాకి సన్నద్ధం అవుతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.