ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటించి మెప్పించిన నవీన్ పొలిశెట్టిని జాతిరత్నాలు సినిమాతో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకు వచ్చాడు. అనుదీప్ దర్శకత్వం వహించిన జాతి రత్నాలు సినిమా మంచి విజయంను సొంతం చేసుకుంది. జాతిరత్నాలు సక్సెస్ లో రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శిల పాత్ర కూడా కీలకంగా ఉంది అనడంలో సందేహం లేదు. సినిమా ప్రమోషన్ కోసం నవీన్ మరియు ప్రియదర్శిలు యూఎస్ కు వెళ్లారు. తనను తీసుకు వెళ్లకుండా ఇద్దరే వెళ్లడంపై రాహుల్ కోపంగా ఉన్నాడు. ఆ విషయమై సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసి మరీ మీ సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
జాతిరత్నాలు సినిమా ప్రమోషన్ కోసం ఈ ముగ్గురు సోషల్ మీడియాలో మరియు ఇతర ప్లాట్ ఫామ్ ల మీద చేసిన సందడి అంతా ఇంతా కాదు. విడుదల తర్వాత కూడా వీరు రచ్చ రచ్చ చేస్తున్నారు. అందులో భాగంగానే సరదాగా నవీన్ మరియు దర్శిలను తిడుతూ రాహుల్ రామకృష్ణ వీడియో షేర్ చేశాడు. సక్సెస్ మీట్ నుండి మీరు పాస్ పోర్ట్ తీసుకుని వెళ్లి పోయారు. నా వద్ద పాన్ కార్డ్ ఉంది నేను వస్తాను అన్నా కూడా నన్ను తీసుకు వెళ్లలేదు. వారు పాన్ కార్డ్ ఉన్నా కూడా రానిస్తారు. నన్ను తీసుకు వెళ్లలేదు కదా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తా అన్నట్లుగా ఫన్నీ వీడియోను రాహుల్ రామకృష్ణ షేర్ చేశాడు. ఈ ముగ్గురితో జాతిరత్నాలు సీక్వెల్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దర్శకుడు అనుదీప్ కూడా తప్పకుండా సీక్వెల్ తీస్తానంటూ చెప్పుకొచ్చాడు.
Full View Full View Full View