మే 20న హైదరాబాద్‌లో వచ్చిన గాలుల తాలూకు బీభత్సం మామూలుగా లేదు. ప్రధాన కూడళ్లలోని హోర్డింగులేకాదు.. దాదాపు చాలా పోష్ కాలనీల్లో పెద్దపెద్ద చెట్లు కూడా పడిపోయాయ్. అయితే మణికొండ వంటి ఏరియాల్లో ఏకంగా ఇళ్ళ తాలూకు అద్దాలు కూడా పగిలిపోయి.. కిటికీ ఫ్రేమ్ సైతం ఎగిరి అవతలపడింది తెలుసా?
దురదృష్టవశాత్తూ.. మొన్న మణికొండ ఏరియాలో 'అందాల రాక్షసి' ఫేమ్ హీరో రాహుల్ రవింద్రన్ ఫ్లాట్ లో ఇలాగే కిటికీ అద్దాలు విరిగిపోయి.. ఏకంగా ఫ్రేము ఫ్రేమూ ఎగిరి హాల్లో పడింది. ఏంటా శబ్దం అని ఉలిక్కిపడిన మన హీరో ఆ అద్దాల మీద చూసుకోకుండా కాళ్ళు వేయడంతో.. అరికాళ్లలోనూ.. పిక్కల దగ్గర కట్ అయి రక్తం వచ్చింది. రక్తం కూడా కాస్త ఎక్కువగానే పోయింది. ఇదే విషయంపై రాహుల భార్య.. సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి స్పందిస్తూ.. ''పోనివ్ లేండి.. దేవుడు కాపాడాడు. అదే ఆ విండో దగ్గర నుంచున్నప్పుడు గ్లాస్ పగిలి ఉంటే.. అ అద్దాలన్నీ రాహుల్ బాడీ మీదుగా దూసుకెళ్ళేవే. కాళ్ళు ఒక్కటే కట్ అయ్యాయ్.. మన అదృష్టం కొద్దీ'' అని చెప్పింది.
మనోడు ప్రస్తుతం కోలుకొని బాగానే ఉన్నాడట. చిన్న చిన్న గాయాలే లైట్ తీస్కోండి అంటున్నాడు.