కొన్ని సార్లు బోల్డ్‌ గా తప్పడం లేదు.. అది యాక్టింగ్ మాత్రమే

Update: 2020-12-13 15:30 GMT
మూస పాత్రలు చేసేందుకు నేను ఇండస్ట్రీకి రాలేదు అంటూ రాయ్‌ లక్ష్మి అంటోంది. హీరోయిన్‌ గా ఐటెం సాంగ్ లతో ఇంకా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసిన ఈ అమ్మడు బోల్డ్‌ పాత్రలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉంది. బోల్డ్‌ పాత్రల విషయంలో ఈ అమ్మడి వాదన వింటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్‌ పాత్ర గ్లామర్‌ పాత్ర అయితే తక్కువ కష్టం ఉంటుందని.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు అయితే ఎక్కువ కష్టం ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఆ విషయం ఏమాత్రం నిజం కాదు. సినిమాలో ఎలా అయినా కనిపించడం అంటేనే కష్టం అంటూ రాయ్‌ లక్ష్మి చెప్పుకొచ్చింది.

కథానాయిక అన్నప్పుడు గ్లామర్‌ పాత్రలు చేయాలి.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలి. ఏ పాత్రలు చేసినా కూడా దానికి పూర్తి న్యాయం చేసే విధంగా నటించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. బోల్డ్‌ పాత్రలు చేయడం పై ఈ అమ్మడు స్పందిస్తూ కథానుసారంగా అలాంటి పాత్రల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నాను. అయితే కొన్ని సందర్బాల్లో నాయిక ప్రధాన సినిమాలు చేసినప్పుడు బోల్డ్‌ గా నటించాల్సి రావచ్చు. ఎలాంటి పాత్రలకు అయినా ఎలాంటి సీన్స్‌ కు అయినా నటించేందుకు సిద్దంగా ఉన్నప్పుడు మాత్రమే హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో రాణించగలరు అంటోంది. హీరోయిన్‌ అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేసినప్పుడు మాత్రమే గుర్తింపు వస్తుందనేది తన నమ్మకం అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.




Tags:    

Similar News