మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ కు ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడు అడ్డంకులు తప్పడం లేదు. షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా కోకాపేట పరిసరాల్లో నైట్ షెడ్యూల్ లో తీస్తున్న సన్నివేశాలకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో ప్యాక్ అప్ చెప్పాల్సి వచ్చిందట. ఇందులోనే కన్నడ స్టార్ హీరో ఈగ విలన్ కిచ్చ సుదీప్ కూడా జాయిన్ అయ్యాడు. భారీ తారాగణంతో పాటు అందరు పరిమితంగా ఇచ్చిన కాల్ షీట్స్ కావడంతో బాలన్స్ చేయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి బాగా కష్టపడుతున్నాడట. ఇప్పటికీ సంగీత దర్శకుడు ఖరారు కాకపోవడం మెగా ఫాన్స్ ను టెన్షన్ పెడుతుంటే మరోవైపు ఇలాంటి ప్రతిబంధకాలు విడుదలను ఆలస్యం చేస్తాయేమో అని భయపడుతున్నారు.
వర్షం పూర్తిగా కుదుటపడితే తప్ప అనుకున్న ఎఫెక్ట్ లో షూట్ చేయటం సాధ్యం కాదు కాబట్టి చిన్న విరామం ఇచ్చినట్టు తెలిసింది. అందుకే నిన్న చిరంజీవి తన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ విజేత ప్రీమియర్ కు రాగలిగారని టాక్. ఈ లెక్కన ఇలాంటివి దాటుకుని వచ్చే సమ్మర్ కు అందులోనూ సెంటిమెంట్ గా భావిస్తూ టార్గెట్ చేసిన మే 9న విడుదల కావాలి అంటే యూనిట్ ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది, బాహుబలిని మించే గ్రాఫిక్స్ ఇందులో ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ లో కనీసం ఐదారు నెలలు అవసరం పడతాయి. సైరాకు అలా జరగాలంటే డిసెంబర్ కంతా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేయాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సైరాలో నయనతార-తమన్నా హీరోయిన్లు కాగా మరో కథానాయిక కూడా అవసరం ఉందట. ఇప్పుడు చేస్తున్న షెడ్యూల్స్ లో ఆ పాత్ర లేదు కనక మరో నెల లోపు దానికి సంబందించిన నిర్ణయం ప్లస్ ఎంపిక జరిగిపోవచ్చు.