బాలీవుడ్ లో కలకలం చెలరేగింది. ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై సైబర్ క్రైం పోలీసులు పోర్న్ వీడియోలు తీస్తున్నారని అరెస్ట్ చేయడం సంచలనమైంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అనూహ్యంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మొబైల్ యాప్ ద్వారా పోర్నో గ్రాఫిక్ కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాతోపాటు 11 మందిని అరెస్ట్ చేయడం బాలీవుడ్ ను కుదిపేసింది. దీనిపై గత జూన్ లోనే పోలీసులకు ఫిర్యాదు అందింది. తనపై ఆరోపణలు రావడంతో రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ఖండించారు. వెబ్ సిరీస్, వీడియోలను ప్రొడ్యూస్ చేసే స్టార్టప్ కంపెనీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. అయితే ఆయనకు పోర్నోగ్రఫి మాఫియాతో రాజ్ కుంద్రాకు లింకులు ఉన్నాయని నిర్ధారించుకొన్న తర్వాత ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు రాజ్ కుంద్రా తెలిపారు. పోర్న్ చిత్రాలు నిర్మించినట్లుగా చెబుతున్న సంస్థతో తాను గతంలోనే తెగదెంపులు చేసుకున్నానని రాజ్ కుంద్రా తెలిపారు.
గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2013 సీజన్ లో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రాపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ లో పాల్గొనకుండా ఆయనపై నిషేధం కూడా పడింది. 2018లో బిట్ కాయిన్ కుంభకోణంలోనూ రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈడీ ఆయనను విచారించింది. తాజాగా పోర్న్ చిత్రాల కేసులో ఇరుక్కోవడంతో రాజ్ కుంద్రా పరువు ముంబైలో పోయినట్టైంది.
ఇప్పటికే ఈ కేసులో మార్చి 26న బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ను కూడా పోలీసులు విచారించారు. ఈ కేసులో షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండేను కూడా విచారించారు. షెర్లీన్, పూనమ్ పాండేలకు రెమ్యూనరేషన్ ఇచ్చి వారితో అడల్ట్ కంటెంట్ షూట్ చేశారని ప్రచారం సాగింది. షెర్లీన్ కు ప్రతి ప్రాజెక్టుకు 30 లక్షలు ఇచ్చారని.. ఇప్పటివరకు 20 ప్రాజెక్టులను షెర్లీన్ పూర్తి చేసిందని ముంబై సైబర్ క్రైం విభాగం వెల్లడించింది.
ఇక తాజాగా ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే మాట్లాడుతూ ఈ పోర్న్ వీడియోల చిత్రీకరణలో రాజ్ కుంద్రా ప్రధాన సూత్ర ధారి అని తెలిపారు. జూలై 19వ తేదీన ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు.విచారణ కొనసాగతోందని.. ఈ కేసులో మాకు పూర్తి స్థాయిలో సాక్ష్యాలు ఉన్నాయని హేమంత్ తెలిపాడు.
రాజ్ కుంద్రాపై ఐటీయాక్ట్ , ఇండిసెంట్ రిప్రజేంటేషన్ ఆఫ్ ఉమెన్ చట్టాల కింద ఐపీసీ 292,67,67ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ హేమంత్ తెలిపారు.
అశ్లీల, అసభ్య వీడియోల వ్యవహారం బయటకు పొక్కడంతో మరోసారి బాలీవుడ్ ప్రతిష్ట మసక బారింది. ఇప్పటికే డ్రగ్స్ మాఫియాతో సినీ తారల లింకులు బయటపడి పరువుపోయింది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ హిందీ సినిమా రంగంలో ఎన్ని లోటుపాట్లు, దారుణాలు ఉన్నాయనే విషయం తేటతెల్లమైంది. వివాదాస్పద అంశాలు బయటకొచ్చాయి. వాటి నుంచి బయటపడకముందే రాజ్ కుంద్రా అరెస్ట్ మరోసారి సంచలనం రేపింది.