విడాకుల ఎపిసోడ్ లో కవితపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్ కుంద్రా

Update: 2021-06-12 07:30 GMT
రోటీన్ కు భిన్నమైన వార్తతో హాట్ టాపిక్ గా మారారు ప్రముఖ వ్యాపారవేత్త రాజ్  కుంద్రా. ప్రముఖ నటి శిల్పాశెట్టిని పెళ్లాడిన తర్వాత ఆయన ఒక్కసారిగా అందరికి సుపరిచితంగా మారారు. శిల్పను పెళ్లాడటానికి ముందు అతగాడికి కవితతో పెళ్లైంది. తాజాగా ఆమెకు విడాకులు ఇచ్చే ప్రాసెస్ లో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. శిల్పాతో ప్రేమాయణం కారణంగానే కవితతో విడిపోయినట్లుగా ఒక వాదన ఉంది.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ అంశాల్ని ప్రస్తావించి సంచలనంగా మారారు రాజ్ కుంద్రా.  తన మొదటి భార్య కవితతో విడిపోవటానికి కారణం శిల్పాశెట్టి ఎంతమాత్రం కాదన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాలతోనే తామిద్దరం విడిపోయినట్లు చెప్పారు.

‘కొంతకాలం క్రితం మేం లండన్ లో ఉన్నాం. మా పేరెంట్స్ తో పాటు చెల్లి.. ఆమె భర్త కూడా మాతోనే ఉండేవారు. దాంతో కవితకు నా చెల్లెలు భర్తతో రిలేషన్ పెరిగింది. బిజినెస్ పనులపై ఎప్పుడైనా టూర్ కు వెళితే.. కవిత ప్రవర్తన మారేది. నా చెల్లెలు భర్తతో కవితకు రిలేషన్ ఉందని ఇంట్లో వాళ్లంతా చెప్పారు. మా కారు డ్రైవర్ సైతం వారి గురించి అసభ్యంగా చెప్పాడు. దీంతో మా చెల్లిని.. ఆమె భర్తను ఇండియాకు పంపేశాం. అయినా అతడితో కవిత మాట్లాడటం మానలేదు’’ అంటూ సంచలన విషయాల్నివెల్లడించారు.

తనకు తెలీకుండా సీక్రెట్ గా ఒక సెల్ కొని.. దాని నుంచి అతనికి మెసేజ్ లు పంపేదని.. ఒకసారి ఆ ఫోన్ తన కంట పడటంతో తన మనసు ముక్కలైందన్నాడు. ఆ తర్వాతే శిల్పాశెట్టి ప్రవేశించినట్లు చెప్పాడు. తన గురించి శిల్పకు అన్ని తెలుసని.. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తాను విడిపోయిన భార్య గురించి.. ఆమె క్యారెక్టర్ ను దారుణంగా దెబ్బ తీసేలా రాజ్ కుంద్రా మాట్లాడకుండా ఉండాల్సిందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడీ విషయాలన్ని చెప్పి ఏం సాధించాడు? అన్న మాటను కొందరు సందిస్తున్నారు.
Tags:    

Similar News