`రాజుగాడు` `రంగుల రాట్నం` తిప్పుతాడా?

Update: 2018-01-13 07:06 GMT
ప్ర‌తి ఏటా సంక్రాంతికి తెలుగు లోగిళ్ల‌లో గొబ్బెమ్మ‌ల‌తో పాటు.....టాలీవుడ్ లో సినిమాలు సంద‌డి చేయ‌డం ఆన‌వాయితీ. కొత్త సంవ‌త్స‌రంలో వ‌చ్చే తొలి తెలుగు పండుగ‌ను హిట్ తో ప్రారంభించాల‌నేది టాలీవుడ్ హీరో హీరోయిన్లు - ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ కు త‌గ్గ‌ట్లుగానే గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన 4 సినిమాల‌లో 3 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. సంక్రాంతి సెంటిమెంట్ ను బ‌లంగా న‌మ్మే బాల‌య్య బాబు గ‌త ఏడాది....గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణితో బంప‌ర్ హిట్ కొట్టాడు. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెం.150తో త‌న స్టామినా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ప్రూవ్ చేశాడు. చ‌క్క‌ని కుటుంబ క‌థ నేప‌థ్యంలో దిల్ రాజు - శ‌ర్వానంద్ ల కాంబోలో వ‌చ్చిన‌ `శ‌త‌మానంభ‌వ‌తి` ఆ ఇద్ద‌రు పెద్ద హీరోల పోటీని త‌ట్టుకొని మ‌రీ హిట్ కొట్టింది. అయితే, ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ లో సంక్రాంతి సంద‌డి క‌నిపించ‌డంలేదు.

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన మోస్ట అవెయిటెడ్ మూవీ `అజ్ఞాత‌వాసి` ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ ను నిరాశ‌ప‌రిచింది. అయితే, సంక్రాంతి పందెంకోడిగా బ‌రిలోకి దిగిన బాల‌య్య బాబు `జై సింహా`కూడా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆకట్టుకోలేక‌పోయింది. ఈ సినిమాకు కూడా మిక్స్ డ్ టాక్ రావ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ నిరాశ‌చెందారు. టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న సూర్య `గ్యాంగ్ ` కూడా యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో, రేపు విడుద‌ల కాబోతోన్న `రంగుల రాట్నం` పై అంచ‌నాలు పెరిగాయి. అన్నపూర్ణ బ్యాన‌ర్ లో రాజ్ త‌రుణ్ - చిత్రా శుక్లా జంట‌గా న‌టించిన ఈ ల‌వ్ స్టోరీపై నాగ్ కు గ‌ట్టి న‌మ్మ‌కముంద‌ని టాక్. కుమారి 21 ఎఫ్ త‌ర్వాత రాజ్ త‌రుణ్ కు కూడా చెప్పుకోద‌గ్గ హిట్ లేదు. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ నుంచి రావ‌డంతో పాటు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను రాజ్ త‌రుణ్ ఎంత వ‌ర‌కు క్యాష్ చేసుకుంటాడో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్ త‌రుణ్ మార్కెట్ 5-10 కోట్ల వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. ఈ సినిమా రాజ్ త‌రుణ్ కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని టాలీవుడ్ విశ్లేష‌కుల అంచ‌నా. ముఖ్యంగా యువ‌త‌నుంచి ఈ సినిమాకు మంచి టాక్ వ‌స్తే ....ఈ ఫెస్టివ‌ల్ వీకెండ్ లో రాజ్ త‌రుణ్ `రంగుల రాట్నం ` తిప్పేస్తాడ‌నడంలో ఎటువంటి సందేహం లేదు. మ‌రి, ఆ అంచ‌నాల‌ను అందుకొని రాజ్ త‌రుణ్ స్టార్ హీరోగా అవ‌త‌రిస్తాడా లేదా అన్నది తెలియాలంటే....ఇంకో రోజు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News