సడెన్‌గా సంక్రాంతి రేసులోకి వచ్చింది అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ‘రంగుల రాట్నం’ సినిమా. రాజ్ తరుణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘ఉయ్యాల జంపాల’ తరహాలోనే ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ కూడా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుందన్న ధీమాతో ఉన్నాడు నాగ్. అందుకే రిలీజ్ డేట్ కు కేవలం పది రోజుల ముదు ఈ సినిమాను జనాలకు పరిచయం చేశాడు. ఫస్ట్ లుక్.. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసి ప్రమోషన్లకు శ్రీకారం చుట్టాడు. మొన్న రిలీజైన ‘రంగుల రాట్నం’ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఐతే ఈ ట్రైలర్ చూస్తే సినిమా మరీ కొత్తగా ఉంటుందన్న ఆశలైతే కలగలేదు.
ఇందుకు కారణం ఈ ఏడాదే వచ్చిన మరో సినిమా ఛాయలు ఇందులో కనిపించడమే. ఆ సినిమా అక్కినేని నాగార్జున నిర్మించిందే కావడం విశేషం. నాగ్ ప్రొడక్షన్లో నాగచైతన్య-రకుల్ ప్రీత్ జంటగా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఛాయలు ‘రంగుల రాట్నం’లో కనిపించాయి. ‘రారండోయ్..’కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర.. ‘రంగుల రాట్నం’లో హీరోయిన్ క్యారెక్టర్ ఒకేలా కనిపిస్తున్నాయి. అందులో హీరోయిన్ లాగే ఇందులో కథానాయిక కూడా టిపికల్ క్యారెక్టర్ తో హీరోకు చుక్కలు చూపిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. అందులో మాదిరే హీరోయిన్ చేష్టలకు విసుగొచ్చి బ్రేకప్ చెప్పేస్తున్నాడు. మరి ఈ పోలికల నేపథ్యంలో సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం కొత్తదనం పంచుతుంది.. సంక్రాంతికి విపరీతమైన పోటీ మధ్య ఎలా తన ప్రత్యేకతను చాటుకుంటుంది అన్నది చూడాలి. శ్రీరంజని అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందించింది. మిగతా సంక్రాంతి సినిమాలన్నీ రిలీజయ్యాక చివరగా.. జనవరి 14న ‘రంగుల రాట్నం’ను రిలీజ్ చేయాలన్నది నాగ్ ప్లాన్.