రఫ్ గా అంత అవుతోందట

Update: 2018-01-17 05:19 GMT
మల్టీస్టారర్ కథ అంటే తెలుగులో మొన్నటివరకు ఒక కల అనుకున్నాం. కానీ రాజమౌళి ఎప్పుడైతే చరణ్ - ఎన్టీఆర్ తో ఫోటో కి స్టిల్ ఇచ్చాడో అప్పటి నుండి ఆ నిజమైన కల ఎలా ఉంటుందో అని మరో కలలు కంటున్నాం. మొత్తానికి సినిమా తెరపైకి వచ్చే వరకు ఊహించని స్థాయిలో కలలో తెలిపోతాం అనేది వాస్తవం. ఇక మెగాస్టార్ నందమూరి అభిమానులకు అయితే నిజంగా పెద్ద పండగే. మన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తారు అని రాజమౌళి నిరూపించబోతున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. మల్టీస్టారర్ అంటే బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలు బడా దర్శకుడు కాబట్టి నిర్మించే బడ్జెట్ కంటే వారికే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. ప్రస్తుతం జక్కన్న మల్టీస్టారర్ గురించి కూడా సినీ పరిశ్రమ ఇదే చర్చించుకుంటోంది. అయితే సినిమాలో తారక్ - చరణ్ అలాగే రాజమౌళి రెమ్యూనరేషన్ విషయాలని పక్కనపెడితే సినిమా నిర్మాణానికే దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ అవుతోందట. ఇటీవల రాజమౌళి నిర్మాతకు ఒక రఫ్ ఎస్టీమేట్ లిస్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. గ్రాఫిక్స్ వర్క్స్ ఏమి ఉండవట. కేవలం యాక్షన్ పరమైన సన్నివేశాలకు ఖర్చు ఎక్కువవ్వనుందని సమాచారం.

ఇక సినిమాలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ బ్రదర్స్ లా కనిపించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలో రాజమౌళి అధికారికంగా ఈ మల్టీస్టారర్ గురించి చెప్పనున్నాడు. ఇక సినిమాను స్టార్ట్ చేస్తే 9 నెలల్లో ఫినిష్ చేయాలని రాజమౌళి టీమ్ టార్గెట్ పెట్టుకుంది. 2018లో దసరా కానుకగా సినిమాని తెలుగుతో పాటు తమిళ్ - హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Tags:    

Similar News