రాజ‌మౌళి క్లాప్ తో కీర‌వాణి వార‌సుడి రెండో సినిమా..!

Update: 2020-10-25 18:26 GMT
 ప్రముఖ స్వరకర్త ఎంఎం కీరవాణి కుమారుడు.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క‌జిన్ సింహా కొడూరి ఇప్ప‌టికే హీరోగా ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. సింహా న‌టించిన `మ‌త్తు వ‌ద‌ల‌రా` క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డ‌మే గాక‌.. చిత్ర‌బృందానికి న‌టీన‌టుల‌కు పేరు తెచ్చింది.

ప్ర‌స్తుతం ఈ యంగ్ ట్యాలెంటెడ్ హీరో ఓ రొమాంటిక్ కామెడీలో న‌టించ‌నున్నారు. మ‌ణికాంత్.జె ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నేడు సింహా న‌టిస్తున్న రెండో సినిమా విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. చిత్ర ప్రారంభోత్సవం ఈ రోజు చిత్ర కార్యాలయంలో జరిగింది.

కీరవణి స్క్రిప్ట్ ‌ను మేకర్స్ ‌కు అందజేశారు. పురాణ పాండా శ్రీనివాస్ కెమెరా ఆన్ చేయగా.. రాజమౌళి ప్రధాన తారాగణంపై మొదటి షాట్ కోసం క్లాప్ కొట్టారు. బెనెర్జీ ముప్పనేని సహకారంతో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర శుక్లా- మిషా నారంగ్ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా ఆడిపాడ‌నున్నారు. సింహా న‌టించిన మొద‌టి చిత్రంతోనే అత‌డి సోద‌రుడు కాల భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటారు. ఇప్పుడు రెండో చిత్రానికి అత‌డే సంగీతం అందించ‌నున్నారు. సురేష్ రగుటు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేయ‌నున్నారు.



Tags:    

Similar News