చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రాజెక్టుకు రాజమౌళి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా అని తేల్చేశాడు. బాహుబలికి ముందు నిర్మాతలు దానయ్య, కేఎల్ నారాయణలు రాజమౌళితో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట.. మహేశ్ బాబు హీరోగా ఓ కౌబాయ్ సినిమా చేద్దామని నిర్మాత కేఎల్ నారాయణ అనుకున్నారట.. కానీ మధ్యలో బాహుబలి రావడం 7ఏళ్లు అలా గడిచిపోవడం జరిగిపోయాయి. బాహుబలి దెబ్బకు రాజమౌళి దేశంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగిపోయాడు. ఆ తర్వాత చరణ్, ఎన్టీఆర్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మొదలుపెట్టేశాడు.
అయితే తన బకాయి పడ్డ నిర్మాత కేఎల్ నారాయణతో సినిమా చేయడానికి రాజమౌళికి టైం లేకుండాపోయింది.. అంతకుముందు మరో నిర్మాత డీవీవీ దానయ్య తో ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్నాడు. రాంచరణ్ -ఎన్టీఆర్ లతో కలిసి భారీ మల్టీస్టారర్ సినిమాను తెరెక్కిస్తున్నారు. ఇప్పుడీ మల్టీస్టారర్ ముగిశాక మహేశ్ బాబుతో సినిమా చేయడానికి జక్కన్న ప్లాన్ చేసినట్టు సమాచారం.
వచ్చే ఏడాది మహేష్ బాబుతో సినిమా చేసేలా నిర్మాత కేఎల్ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇంతకీ మరి మహేష్ బాబు ఎలాంటి జోనర్ లో.. ఏ కథతో రాజమౌళి సినిమా తీస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇదివరకే కౌబాయ్ కథ అని ఒకసారి.. కాదు జేమ్స్ బాండ్ టైప్ సినిమా కథ అని ప్రచారం సాగింది. రాజమౌళి సైతం జేమ్స్ బాండ్ లాంటి కథ అయితేనే మహేష్ బాబుకు సూట్ అవుతుందని అన్నాడు.
తాజాగా రాజమౌళి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబుతో సినిమా గురించి ఇప్పుడే ఏ కథ అనుకోలేదని.. తాము ఏమీ చర్చించుకోలేదని రాజమౌళి తెలిపారు. మహేష్ బాబు ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్ తోపాటు నా అభిరుచికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.
అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాక తన తదుపరి సినిమా మొదలుపెడుతానని రాజమౌళి తెలిపారు. మహేష్ బాబుతో ఇంకా కథ గురించి చర్చించలేదని స్పష్టం చేశాడు.
మహేష్ తో తీయబోయే చిత్రం కౌబాయ్ అని.. జేమ్స్ బాండ్ కథ అని సాగుతున్న ఊహాగానాలకు రాజమౌళి మాటలతో తెరపడింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాతే దీనిపై క్లారిటీ రానుంది.