చిరు వాయిస్ ఓవర్ పై జక్కన్న క్లారిటీ

Update: 2017-03-06 06:44 GMT
మెగాస్టార్ చిరంజీవి చేత వాయిస్ చెప్పించడం ఇప్పుడు టాలీవుడ్ సెంటిమెంట్ అయిపోయింది. ఆయన మాట  వినిపిస్తే చాలు.. సినిమా సూపర్ హిట్ అనేస్తున్నారు. సిట్యుయేషన్ కూడా ఇందుకు మద్దతు గానే ఉంది.

రుద్రమదేవి నుంచి మొదలు పెడితే.. ఆ మూవీ అనూహ్యమైన విజయం సాధించేసింది. గత నెలలో వచ్చిన ఘాజీ.. అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. రీసెంట్ గా మంచు మనోజ్ గుంటూరోడు కూడా విజయం సాధించడంతో ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. తాజాగా బాహుబలి2 చిత్రానికి కూడా చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పబోతున్నారనే టాక్ మొదలైంది. ఇది అంతకంతకూ పెరిగిపోతుండడంతో.. ఇప్పుడీ విషయంపై క్లారిటీ ఇఛ్చాడు రాజమౌళి.

'బాహుబలి2కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇవ్వబోతున్నానే  న్యూస్ లో నిజం లేదు' అంటూ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు జక్కన్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News