శంకర్‌తో రాజమౌళి పోలిక

Update: 2015-07-07 07:22 GMT
కథ లేనిదే హీరో ఎంతసేపు సినిమాని నడిపించగలడు? ప్రేక్షకులు కుర్చీలో కూచోవాలంటే హీరోతో పాటు కథ, కంటెంట్‌ ముఖ్యమని బల్లగుద్ది మరీ చెప్పాడు రాజమౌళి. ఈ ఒక్క మాటతో అతడిని శంకర్‌తో పోల్చడం మొదలు పెట్టారంతా.

శంకర్‌ కూడా ఇదే తరహా. అతడు ముందుగా కథ రాసుకుంటాడు. ఆ కథలో హీరో పాత్రని హైలైట్‌ చేస్తాడు. అప్పుడు హీరో వేట మొదలుపెడతాడు. కథకు, తాను ఊహించుకున్న పాత్రకు సరిగ్గా సరిపోయే హీరో వెంట పడతాడు.. తప్ప సూపర్‌స్టార్ల కోసం వెంపర్లాడడు. అంతేనా సూపర్‌స్టార్లతో అసలు సినిమాలు తీయడానికే ఇష్టపడడు. ఒకవేళ తీస్తే గనుక రజనీకాంత్‌, విక్రమ్‌ రేంజు మాత్రమే.

శంకర్‌ స్టామినాని చూడాలంటే భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు, రోబో, ఐ చిత్రాల్ని చూస్తే సరిపోతుంది. అందులో అతడు హీరోల్ని ఆవిష్కరించిన తీరు ఏ రేంజులో ఉంటుందో తెలుస్తుంది. అయితే అవేవీ హీరోల్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నవి కావు. ఓ గొప్ప కథని రాసుకుని అందులో పాత్రల్ని సృష్టించుకున్న తర్వాత హీరో వచ్చి ప్రాజెక్టుకు అస్సెట్‌ అయ్యారు. ఇక రాజమౌళి కాస్త డిఫరెంట్‌.

మనోడు ముందు స్టార్‌ హీరోని ఫిక్స్‌ చేసుకుని విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, మగధీర వంటి సినిమాల్ని తీశాడు. బాహుబలి కూడా ప్రభాస్‌ని అనుకున్నాకే ప్లాన్‌ చేసుకున్నది. కాబట్టి కథ కంటే హీరోకే ప్రాముఖ్యతనిచ్చాడు. అలాగని కథని గుండు సున్నాని చేయలేదు. హీరో శరీరభాషకు తగ్గట్టే కథలు రాసుకుని సక్సెస్‌లు అందుకున్నాడు.

కాబట్టి శంకర్‌కి రాజమౌళికి ఓ సన్నిని అడ్డు రేఖ ఉన్నా.. కథ విషయంలో ఇద్దరిలోనూ కామన్‌ ఎలిమెంట్‌ ఒక్కటే.

Tags:    

Similar News