ఎగ్జిబిట‌ర్ల‌కి రాజ‌మౌళి కండీష‌న్‌!

Update: 2020-10-04 17:34 GMT
ఈ నెల 15 నుంచి తెలంగాణ వ్యాప్తంగా థియుట‌ర్లు రీ ఓపెన్ కాబోతున్నాయి. ఈ విష‌యంపై శ‌నివారం థియేట‌ర్స్ యాజ‌మాన్యాలు స‌మావేశ‌మై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. 50 శాతం థియేట‌ర్ ఆక్యుపెన్సీనతో ర‌న్ చేయ‌డానికి అంగీక‌రించింది. అయితే ఈ నిర్ణ‌యానికి రాజ‌మౌళి షాకిచ్చాడు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెర‌వ‌డం కంటే వంద శాతం ఆక్యుపెన్సీకి ఎప్పుడు అనుమ‌తిస్తారో అప్పుడే తెర‌వ‌డం మంచిద‌ని షాకిచ్చారు.

ఎంట‌ర్‌ టైన్ ‌మెంట్ విష‌యంలో మిగ‌తా ప్ర‌పంచంలో మ‌న వారిని పోల్చ‌లేం. థియేట‌ర్ల‌లో సినిమాని ఎంజాయ్ చేయాల‌ని మ‌న వాళ్లు అత్య‌ధికంగా కోరుకుంటారు. కాబ‌ట్టి మిగ‌తా దేశాల లాగా మ‌న‌కు ప్ర‌తికూల ప్ర‌భావం వుంటుంద‌ని నేను అనుకోవ‌డం లేదు అంటున్నారు రాజమౌళి. ఇక జ‌నాలు ఎదురుచూసే చిత్రాలు వ‌స్తే త‌ప్ప‌కుండా థియేట‌ర్‌కు వ‌స్తారన్నారు.

పారితోషికారు 20 శాతం త‌గ్గించుకోవ‌డంపై షాకింగ్ గా స్పందించారు. రెమ్యున‌రేష‌న్‌లు త‌గ్గించుకోవ‌డానిక న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎప్పుడూ సిద్ధంగా వున్నార‌ని కాక‌పోతే అది సినిమా సినిమాకి ఒకేలా వుండ‌ద‌ని యారుతూ వుంటుంద‌ని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు. పారితోషికాల విష‌యంలో అంద‌రికీ ఒకే రూలు స‌రికాద‌ని ఓ ప్రాజెక్ట్ సెట్ కావాలంటే ఏది బాగ‌నిపిస్తే అది జ‌రుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడేదో క‌రోనా వ‌చ్చింద‌ని పారితోషికాల చ‌ర్చ అన‌వ‌స‌రం అన్నారు రాజ‌మౌళి.


Tags:    

Similar News