బ్రహ్మాస్త్రకు రాజమౌళి తండ్రి రిపేర్లు

Update: 2022-06-01 07:30 GMT
బ్రహ్మాస్త్ర సినిమాతో ఎలాగైనా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆ చిత్ర యూనిట్ సభ్యులు గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలు పాన్ ఇండియా రూపంలో హిందీ మార్కెట్ పై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. అక్కడ లోకల్ హీరోల కంటే కూడా భారీ స్థాయిలో తెలుగు హీరోలు కలెక్షన్స్ సాగిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ మార్కెట్ పై ఫోకస్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

 నార్త్ దర్శకులు కూడా తెలుగు మార్కెట్ పెద్దగా ఉంది అని ప్రమోషన్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక ముఖ్యంగా అగ్ర దర్శకుడు రాజమౌళి సహాయంతో బ్రహ్మాస్త్రం చిత్ర యూనిట్ సభ్యులు తెలుగులో ప్రమోషన్ డోస్ పెంచుతున్నారు.

ఈ సినిమాను తెలుగులో రాజమౌళి విడుదల చేయబోతున్నాం విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ప్రమోషన్ వైజాగ్ లో నిర్వహించారు. అయితే ఆ మీటింగ్ లో దర్శకుడు ఆయాన్ ముఖర్జీ స్పందించిన విధానం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతొంది.

రాజమౌళి ఈవెంట్ లో మొదట ఈ సినిమాను తన తండ్రికి చూపించారు అని అన్నారు. తనకు ఎందుకు చూపించలేదని కూడా రాజమౌళి అడగడంతో బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయాన్ చాలా సరదాగా స్పందించాడు. మీ నుంచి మీ తండ్రిని దొంగలించాలాని ఉంది అని ఆయన వివరణ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. అయితే బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాని విజేయేంద్ర ప్రసాద్ కు మొదట చూపించారట. అయితే  విజయేంద్ర ప్రసాద్ సినిమా చూసిన తర్వాత కొన్ని మార్పులు చేయాలని చెప్పడంతో ఆయన ఆలోచనా విధానం ప్రకారమే దర్శకుడు చివర్లో కొంత రీషూట్ చేసినట్లుగా కూడా రన్బీర్ కపూర్ వైజాగ్ మీటింగ్ లో వివరణ ఇచ్చాడు.

ఆయన అనుభవం కూడా సినిమాకు ఉపయోగపడిందని చెప్పడం విశేషం. ఇక బ్రహ్మాస్త్ర సినిమాను హిందీలోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో భారీ స్థాయిలో సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. మరి బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News