దాసరినారాయణ రావు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మూలస్థంభం! సినీకార్మికుల గురించి ఆలోచించే పెద్దమనసున్న పెద్దమనిషి. బేషజాలకు పోకుండా సినిమా ఫంక్షన్ అంటే చాలు రెక్కలు కట్టుకుని... అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ఆలోచించకుండా వాలిపోయే "సినిమా మనిషి"! ఏమాత్రం అవకాశం ఉండి ఆరోగ్యం సహకరించినా అన్ని సినిమా ఫంక్షన్ లకూ అటెండ్ అవుతూ... తన అనుభవాలను పంచుతూ, సహచరులకు కొత్తవారికి తగు సూచనలు చేస్తూ ఉంటారు. దీంతో దాసరి అందరిమనిషి అయిపోయారు.
తాజాగా రాఘవేంద్ర రావు శిష్యుడిగా 2001లో విడుదలైన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దర్శక ధీరుడు రాజముళి కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు! రాజమౌలి కెరీర్... బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనే స్థాయిలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు రాజమౌలి సామాన్య దర్శకుడు కాదు, సాదారణ దర్శకుడు కాదు... దర్శకధీరుడు! ఆ స్థాయిలో ఉన్నా కూడా చిన్న చిన్న సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతుంటారు. కొత్త దర్శకులకు సంబందించి విడుదలైన ఫస్ట్ లుక్స్ పైనా, టీజర్స్ పైనా తన అభిప్రాయాలను చెబుతుంటాడు. తనదైన శైలిలో ప్రోత్సహిస్తుంటారు. పెద్ద దర్శకుడు అంటే... అందనంత దూరంలో ఉండటంకాదు.. అందరితో ఉండటం అని మరోసారి నిరూపించే పనిచేస్తున్నారు రాజమౌలి! ఎవరు ఏమనుకున్నా, ఏది ఏమైనా... రాబోయే తరానికి రాజమౌలే పెద్ద దిక్కు అని అన్నా అతిశయోక్తి కాదు!