తన సినిమాల్లోని స్ర్కీన్ ప్లే ఎంత కొత్తగా ఉన్నా కూడా.. ఎందుకో మరి మనోడికి ఆ హిట్టు మాత్రం అందట్లేదు. 'మనమంతా' అంటూ చాలా ఇంప్రెసివ్ గా ఈసారి ఒక పెద్ద హిట్టు కొట్టాలని ఉవ్విళూరుతున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. ఈ సినిమాతో అది సాధ్యపడుతుందో లేదో చూడాలని సాక్షాత్తూ జక్కన్న రాజమౌళి వంటి దర్శకులే ఎదురు చూస్తున్నారు.
మనమంత సినిమా టీజర్ చాలా బాగుందని.. చూస్తుంటేనే ఫుల్ కిక్కిస్తోందని.. ఇంతకీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి బాసూ... అంటూ రాజమౌళి ఒక ట్వీట్ వేశాడు. అంతే కాదు.. ''మోహన్ లాల్ ను తెలుగు తెరకు తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అంటూ మరో కామెంట్ చేశాడు జక్కన్న. ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుచేసుకోవాలి మనం. అసలు మన బాహుబలి దర్శకుడు ఈ కామెంట్ చేయడం వెనుక.. ఆయనకు గతం ఏదైనా గుర్తొచ్చి ఉండొచ్చు. ఎందుకంటే స్టూడెంట్ నెం.1 సినిమా తరువాత మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ఒక మైథలాజికల్ సినిమా చేయాలని రాజమౌళి స్కెచ్ వేశాడు. కాకపోతే షూటింగ్ మొదలయ్యాక ఆ సినిమా ఆగిపోయింది.
అప్పటి నుండి మోహన్ లాల్ ను డైరక్టు చేయలేకపోయాననే బాధ జక్కన్నకు మిగిలిపోయిందని టాక్. అందుకే ఇప్పుడు తన స్నేహితుడు చంద్రశేఖర్ ఏలేటి ఇలా మలయాళం మెగాస్టార్ ను తెస్తున్నందుకు జక్కన్న నోస్టాలజిక్ గా ఫీలై.. తరువాత హ్యాపీగా ఫీలైయుంటాడు.