దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిజానికి 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఈ చిత్రం 2020 జులై 30న విడుదల కావాల్సింది. కానీ అనుకోని అవాంతరాలు ఏర్పడి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 2021 జనవరి 8న సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈసారి కరోనా మహమ్మారి వచ్చి షూటింగ్ కి బ్రేక్స్ వేసింది. దీంతో విడుదల కూడా వాయిదా పడనుంది. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ ని మార్చాల్సి వచ్చిందని.. అందుకే ఈసారి డేట్ అనౌన్స్ చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రావాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.
కాగా, 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని హైదరాబాద్ లో షూటింగ్ జరపనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''కరోనా ముందైతే 'ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ చెప్పను కానీ ఇప్పుడు అలా చెప్పడం కష్టం.. కొన్ని పద్ధతుల్లో షూటింగ్ చేయాల్సి ఉంది.. ప్రాక్టికల్ సమస్యలేంటో తెలుసుకోవాలి.. ఇప్పుడు కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. రెండు నెలలు షూటింగ్ అనుకున్నట్లు జరుగుతుందా అనేది చూసుకోవాలి. తర్వాతే రిలీజ్ డేట్ పై అవగాహన కలుగుతుంది'' అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ మారడంతో మరోసారి డేట్ అనౌన్స్ చేస్తే ఖచ్చితమైన తేదీని చెప్పాలని రాజమౌళి అనుకుంటున్నాడట. ఈ రెండు నెలలు షూటింగ్ సజావుగా సాగితే డిసెంబర్ లో విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాజమౌళి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.