రాజమౌళి ఈమధ్యే #RRR ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి యాక్టర్స్ కు ఒక లాంగ్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ 'వినయ విధేయ రామ' షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉండడం.. మరో వైపు రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం కూడా త్వరలో ఫిక్స్ చేయడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే #RRR కు సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.
'బాహుబలి 2' విడుదలైన ఒకటిన్నర ఏడాది గ్యాప్ తీసుకున్నా ఇంకా #RRR బౌండ్ స్క్రిప్ట్ మాత్రం రెడీ కాలేదట. రాజమౌళి సహజంగా బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్న తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాడు. స్క్రిప్ట్ పూర్తికాకుండా షూటింగ్ మొదలు పెట్టడు. కానీ మొదటి సారి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయకుండానే #RRR షూటింగ్ మొదలు పెట్టాడట. అందుకే ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించేలోపు మిగతా స్రిప్ట్ వర్క్ పూర్తి చేసి బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడని సమాచారం.
రాజమౌళి తన సినిమాలను శిల్పం చెక్కినట్టు చెక్కుతూ ఉంటాడనే ఆయనను అభిమానులు ప్రేమగా జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఈమధ్య సినిమాను మాత్రమే కాకుండా స్క్రిప్టును కూడా జక్కన్నలాగా చెక్కుతున్నాడన్నమాట. ఏదైనా కానివ్వండి.. అభిమానులు మాత్రం 'బాహుబలి' ని మించిన సినిమాను అయన నుండి ఆశిస్తున్నారు. ఆలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కదా.