బాహుబలి సినిమాను హిందీలో కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత రిలీజ్ చేయడం వల్లే అక్కడ అంత పెద్ద విజయం సాధించిందని రాజమౌళి చెప్పాడు. ఆయన లేకుంటే ‘బాహుబలి’ ఈ స్థాయి సినిమా అయ్యేది కాదని జక్కన్న అన్నాడు. ఐతే నిజానికి సినిమాలు తీసే విషయంలో తనకు, కరణ్ జోహార్ కు ఏమాత్రం పొంతన ఉండదని.. తామిద్దరివీ విభిన్నమైన ఆలోచనలని రాజమౌళి చెప్పాడు.
‘‘ఈ సినిమాకు కరణ్ జోహార్ భాగస్వామి కావడం రానా వల్లే జరిగింది. అతనే ఈ ప్రాజెక్టును ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు. మాకు బాహుబలి మీద చాలా నమ్మకముంది. మా దగ్గర క్వాలిటీ ప్రాడెక్ట్ ఉందని తెలుసు. కానీ అది సరైన వ్యక్తి చేతిలో పడితేనే మంచి స్థాయికి వెళ్తుందని అనుకున్నాం. అలాంటి సమయంలోనే కరణ్ మాకు తోడయ్యాడు. ఏ వ్యాపారమైనా భాగస్వాముల్లో ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. బాహుబలి విషయంలో అదే జరిగింది.
నిజానికి కరణ్ జోహార్ గారిని అంతకుముందెప్పుడూ నేను కలవలేదు. సినిమాల విషయాలో ఆయన ఆలోచనలు.. నా ఆలోచనలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఐతే సినిమా పట్ల మా ఇద్దరికీ ఒకే రకమైన ప్రేమ ఉందని మాత్రం ఆయనతో మాట్లాడాక అర్థమైంది. మిగతా విషయాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. రానా సినిమా గురించి చెప్పగానే.. సినిమాలో ఒక సన్నివేశం కూడా చూడకముందే కరణ్ దీన్ని హిందీలో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు. బాహుబలి నార్త్ లో అంత పెద్ద హిట్టవడంలో మేజర్ క్రెడిట్ కరణ్ గారికే దక్కుతుంది’’ అని రాజమౌళి అన్నాడు.