తారక్ కోసం జక్కన్న స్కెచ్ రెడీ!

Update: 2018-10-22 07:30 GMT
ఒకపక్క అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే గ్రాఫ్ పడిపోకుండా జరుగుతున్న ప్రమోషన్స్ లో అలుపు లేకుండా పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ కు అట్టే ఎక్కువ రెస్ట్ దొరికేలా లేదు. రామ్ చరణ్ తో కలిసి నటించబోయే టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ కోసం రంగం సిద్ధమవుతోంది. చెర్రీ ఇంకా బోయపాటి శీను షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తవ్వడానికి మరో నెల రోజులు పైనే పట్టేలా ఉంది. నవంబర్ 18న లాంఛనంగా ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఫ్యాన్స్ ముద్దుగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నాట్టు వార్తలు వస్తున్నాయి. జక్కన్న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ లోపే జూనియర్ లుక్ మీద వర్క్ అవుట్స్ స్టార్ట్ చేసినట్టు తెలిసింది. తారక్ వ్యక్తిగత ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో రాజమౌళి సమావేశమయ్యారు. ఈ మేరకు ఇద్దరు కలిసిన ఫోటోను స్టీవెన్స్ పర్సనల్ గా షేర్ చేసుకోవడంతో ఇది కాస్త బయటికి తెలిసిపోయింది. ఎన్టీఆర్ చరణ్ లకు ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్స్ ని రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలిసింది. అరవింద సమేత వీర రాఘవ కోసం పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ లోకి మారిపోయిన తారక్ ను కాస్త ఒళ్ళు పెంచి కథకు అనుగుణంగా మార్చుకునేలా ఏం చేస్తే బాగుంటుందని చర్చినట్టు తెలిసింది.

దీని పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్టీవెన్స్ పెట్టిన ట్వీట్ ఇప్పటికే వైరల్ అయిపోయింది. వచ్చే నెల షూటింగ్ మొదలుపెట్టినా రాజమౌళి సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. 2020కి గాని వచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ జోరుగా ఉంది. తారక్ లుక్ సరే మరి చరణ్ లుక్ గురించి జక్కన్న ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడో మరి.
Tags:    

Similar News