RRR కు కొత్త డేట్ వెతకాల్సిందేనా?

Update: 2019-09-24 05:06 GMT
ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.  ఇంకా ఎక్కువమాట్లాడితే విదేశాల్లో కూడా రాజమౌళి తదుపరి చిత్రంపై ఆసక్తి ఉందని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు.  రాజమౌళి కొత్త సినిమా 'RRR' షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే జులై 30 వ తేదీ 2020 న ఈ సినిమాను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. 

హాలీవుడ్ సినిమాలకు ఇలా రిలీజ్ డేట్ ను ప్రకటించే ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది.  బాలీవుడ్ సినిమాలకు కూడా రిలీజ్ డేట్ ముందే ప్రకటించే ట్రెండ్ కొన్నేళ్ళ క్రితం మొదలైంది.  అసాధారణ పరిస్థితుల్లో తప్ప రిలీజ్ డేట్స్ మారవు.  కానీ తెలుగు సినిమాల రిలీజ్ డేట్ల విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  అతి తక్కువమంది తెలుగు దర్శకులు మాత్రమే ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ కు సినిమా ను రిలీజ్ చేయగలరు. కానీ జక్కన్న విషయంలో అది చాలా కష్టం. ఎందుకంటే ఆయన పేరే జక్కన్న .. మాహాశిల్పి జక్కన్నలాగా క్వాలిటీ కోసం చెక్కుతూ ఉంటారు కాబట్టే ఆ బిరుదు ఇచ్చారు!  అయితే 'RRR' విషయంలో ఇతర అవాంతరాలు కూడా ఎదురయ్యాయి.  చరణ్.. ఎన్టీఆర్లు గాయాల పాలు కావడం.. బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుండి తప్పుకోవడం లాంటి పలు కారణాల వల్ల సినిమా షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయి.  దీంతో ఈ ప్రభావం రిలీజ్ డేట్ పై పడిందని సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి వచ్చే ఏడాది మే వరకూ సమయం పడుతుందని.. ఆ తర్వాత కనీసం ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేస్తే కానీ ఫస్ట్ కాపీ రెడీ కాదని ఇన్ సైడ్ టాక్.  అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ ను నిలబెట్టుకోవడం అసాధ్యమని అంటున్నారు.  ఈ విషయంలో ఇప్పటికే బాలీవుడ్ ఫిలింమేకర్స్ గ్రహించి వచ్చే ఏడాది జులై 30 వ తేదీకి వేరే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారట.  ఈలెక్కన అభిమానులకు నిరాశతప్పదన్నమాట.. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ పెరిగింది కదా!


Tags:    

Similar News