బాహుబలి2 కి ఇప్పుడు ఫోటోషూట్

Update: 2016-12-13 05:30 GMT
బాహుబది ది కంక్లూజన్ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ నెల 27తో గ్రాఫిక్స్ టీం మినహా.. యాక్టర్స్ - టెక్నీషియన్స్ కి రాజమౌళి ఫ్రీడమ్ ఇచ్చేయనున్నాడని చెప్పేసుకున్నాం. అయితే.. ఇప్పుడు జక్కన్న ఓ స్పెషల్ ఫోటోషూట్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

గురువారం బాహుబలి2 స్పెషల్ ఫోటోషూట్ మొదలుకానుంది. సినిమా పూర్తయ్యే దశలో ఫోటోషూట్ ఏంటా అనిపించచ్చు కానీ.. దర్శకధీరుడి ఆలోచనలు ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటాయి. బాహుబలి2 ప్రమోషన్స్ కోసం ఈ ఫోటోషూట్ ని ఉపయోగిస్తారట. ప్రచారం కోసం సినిమాలోని స్టిల్స్ కాకుండా.. ప్రత్యేకంగా చేసిన ఈ ఫోటోషూట్ లోని స్టిల్స్ నే ఉపయోగించబోతున్నారట. మూవీపై క్యూరియాసిటీ మరింతగా పెంచే ప్లాన్ లో ఇదొక పార్ట్ అంటున్నారు.

బాహుబలి2కి సంబంధించిన మొత్తం తారాగణం అంతా ఈ స్పెషల్ ఫోటోషూట్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. జనవరి నుంచి పూర్తిగా గ్రాఫిక్స్ వర్క్ పైనే దృష్టి పెట్టనున్న జక్కన్న.. మరోవైపు ఆ  సినిమాకి సంబంధించిన ఇతర భాషల డబ్బింగ్ వర్క్స్ ని కూడా హ్యాండిల్ చేసేయనున్నాడు. 2017 ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని ఇప్పటికే తేల్చేశాడులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News