బాహుబ‌లి-క‌ట్ట‌ప్ప ర‌హ‌స్యం ఆ ముగ్గురికే తెలుసు

Update: 2016-08-25 11:30 GMT
బాహుబ‌లి! టాలీవుడ్‌ లోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా సెల్యూలాయిడ్ అద్భుతం! దాదాపు మూడేళ్ల క‌ఠోర ప‌రిశ్ర‌మ‌కి ఈ చిత్రం నిద‌ర్శ‌నం. ముఖ్యంగా  బాహుబ‌లి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఈ మూవీ కోసం ప‌డిన క‌ష్టం అంతా ఇంతాకాదు. బాహుబ‌లి ది బిగినింగ్‌ లో ప్ర‌తి ఫ్రేమ్‌ లోనూ జ‌క్క‌న్న క‌ష్టం మ‌న‌కు క‌నిపిస్తుంది. అయితే, ఆ క‌ష్టంలో మ‌రో టెక్నిక‌ల్ న‌ష్టం కూడా దాగి ఉంది! అదేంటంటే.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక విప్ల‌వ పుణ్య‌మా అని ప్ర‌తి విష‌యాన్నీ క్ష‌ణాల్లో నెట్ ద్వారా వెల్ల‌డించే వెసులుబాటు ఉండ‌డం. ఇదే ఇప్పుడు సినిమా వాళ్ల‌కి పెద్ద ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించింది. ఈ విష‌యంలోనూ రాజ‌మౌళి అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

 బాహుబ‌లి మూవీకోసం ప‌నిచేసిన వారికి ప్ర‌త్యేకంగా ఐడెంటీ కార్డులు ఇచ్చారు. ఎవ్వ‌రిద‌గ్గ‌రా మొబైళ్లు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ప్ర‌తి విష‌యంలోనూ అత్యంత శ్ర‌ద్ధ తీసుకుని బాహుబలి 1ని రూపొందించారు. ఇక‌, ఇప్పుడు బాహుబ‌లి-2 వంతు వ‌చ్చేస్తోంది. ఈ విష‌యంలోనూ జ‌క్క‌న్న అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇక‌, ఈ మూవీ విష‌యానికి వ‌చ్చేస‌రికి.. బాహుబ‌లికి అత్యంత ఆప్తుడిగా సేవ‌లందించిన సేనాని క‌ట్ట‌ప్ప‌.. చివ‌రికి బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నేది పెద్ద స‌స్పెన్స్. అస‌లు ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ కోస‌మే బాహుబ‌లికి అంత క్రేజ్ పెరిగిపోయింది. ఈ ప్ర‌శ్న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్స‌ర్ రాజ‌మౌళితో పాటు క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌కు మాత్ర‌మే తెలుసు.

  అయితే, ఇప్పుడు ఆ ర‌హ‌స్యం వీరిద్ద‌రికి కాకుండా మ‌రో ముగ్గ‌రికి తెలియ‌డం విశేషం. ఒక‌టి క‌ట్ట‌ప్ప‌కి - రెండు బాహుబ‌లికి. మూడు ఈ మూవీ ప్రొడ్యూస‌ర్ శోభు యార్ల‌గ‌డ్డ‌కి. ఈ ప్రశ్నపై వందల కోట్ల వ్యాపారం ఆధారపడినందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం ఎట్టిపరిస్థితుల్లో బయటకు పొక్కకుండా రాజమౌళి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడట.

 ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు యూనిట్ సభ్యులకు తెలిసిపోతుందని భావించిన దర్శకధీరుడు.. కేవలం ముగ్గురి వ్యక్తుల మధ్యే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడట. ఈ సన్నివేశం చిత్రీకరణ ప్రాంతంలో కట్టప్ప - బాహుబలి - శోభు యార్లగడ్డ మినహా ఎవ్వరూ లేకుండా చూసుకున్నాడట. అంతేకాదు, చిత్రీకరించే సీన్ బాహుబలిని కట్టప్ప చంపే సీన్ అని కూడా తెలియకుండా బాహుబలిని - కట్టప్పను కూడా కొంత అయోమయంలో పడేశాడట రాజమౌళి. మ‌రి.. ఈ మూవీ అంతా ఆ పాయింట్ చుట్టూతానే తిరుగుతుంది కాబ‌ట్టి ఆ మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే!! ఏమంటారు?
Tags:    

Similar News