ఆర్ ఆర్ ఆర్ : రంగం సిద్ధం

Update: 2019-03-14 04:52 GMT
బహుశా సినిమా షూటింగ్ ఇంకా పాతిక శాతం కూడా పూర్తి కాకుండానే ఒక ప్రెస్ మీట్ కోసం ప్రేక్షకులు మీడియా అబిమానులు ఇంతగా ఎదురు చూడటం బహుశా ఆర్ఆర్ఆర్ విషయంలోనే జరుగుతోంది. షూటింగ్ మొత్తం జరిగాక ఇలాంటి హైప్ ఉండటం సహజం కాని అసలు హీరొయిన్లు ఆర్టిస్టులు ఎవరు ఉన్నారో తెలియకుండా ఇంత హడావిడి నెలకొని ఉందంటే దీని మీద ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది.

ఈ రోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రెస్ మీట్ ఉంటుందని నిన్ననే ప్రకటించడంతో ఘనమైన ఏర్పాట్లతో టీం రెడీ గా ఉంది. స్టేజికి సంబంధించిన పిక్ కూడా బయటికి వచ్చేసింది. మొత్తం వేదిక మీద నాలుగు కుర్చీలు ఉన్నాయి. అంచనా ప్రకారం ముగ్గురు ఆర్ లు అంటే రామ్ చరణ్ రామారావు (జూనియర్ ఎన్టీఆర్) రాజమౌళితో పాటు నిర్మాత దానయ్య ఉండొచ్చనే టాక్ నడుస్తోంది

ఇంత భారీ స్థాయి ఏర్పాటు చేశారు అంటే ఇద్దరు హీరోలు వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం. ఎలాగూ తారక్ బయట పబ్లిక్ ఫంక్షన్స్ కు వస్తున్నాడు కాబట్టి లుక్ ను దాచాలనే పాయింట్ లేదు. ఇక చరణ్ బయట కనిపించలేదు కాని మరీ అనూహ్యమైన మేకోవర్ ఏమి లేదని యూనిట్ నుంచి ఆల్రెడీ లీక్స్ ఉన్నాయి. సో నాలుగు కుర్చీలు ఎవరికో అన్న క్లారిటీ ప్రస్తుతానికి కనిపిస్తోంది.

ఒకవేళ హీరోలు రాకపోతే ఎవరు ఉంటారు అనేది మాత్రం ఊహకు అందటం లేదు. ఇంకో గంటన్నర వ్యవధి ఉన్నా అభిమానులు మాత్రం ఏదో ట్రైలరో లేక రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రేంజ్ లో ఎదురు చూడటం మొదలుపెట్టారు. అసలే కొణిదెల నందమూరి స్టార్ హీరోల కాంబినేషన్. టాలీవుడ్ కు కొత్త పాఠాలు నేర్పిన రాజమౌళి దర్శకుడు. ఈ మాత్రం హైప్ ఉండటంలో ఆశ్చర్యం ఏముంది 
Tags:    

Similar News