ఈగ 2 తెరకెక్కనుందా?

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 500కోట్ల వసూళ్ల రికార్డును అధిగమించి 600కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది. ఇంతలోనే ఓ స్టన్నింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఈగ సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందన్నదే ఆ వార్త. వాస్తవానికి ఎస్.ఎస్.రాజమౌళికి జాతీయ, అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చిన చిత్రం ఈగ. ఈ సినిమాతో జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు.
2012లో రిలీజైన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ ను సమర్థంగా వినియోగించుకోవడం ఎలానో చూపించింది. మగధీర తర్వాత విఎఫ్ ఎక్స్ పనితనం ఏంటో బాహ్య ప్రపంచానికి తెలియజేసిన చిత్రమిది. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నారని వార్తలొస్తున్నాయి. బాహుబలి 2 పూర్తయ్యాక, ఇక సీక్వెల్ కోసం సన్నాహాలు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఈగ చిత్రానికి దాదాపు 1200 సీజీఐ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఒకవేళ ఈగ2 తెరకెక్కిస్తే బాహుబలిని మించిన కృషి చేయాల్సి ఉంటుంది. దాదాపు 2000 పైగా సీజీఐ సన్నివేశాల్ని తెరకెక్కించే అవకాశం ఉందని ఊహించవచ్చు. మరోసారి నాని, సుదీప్, సమంత, ఈగలతో మ్యాజిక్ మొదలవుతుందన్నమాట!