ఇప్పుడు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ బాహుబలి ది కంక్లూజన్. మొదటి భాగంలో రాజమౌళి వదిలిన ఎన్నో పజిల్స్ కు ఆన్సర్ల తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు జనాలు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయిన ఈ చిత్రానికి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఈ నెల 16నుంచి బాహుబలి2కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ట్రైలర్ రిలీజ్ తో ఈ పబ్లిసిటీ హంగామాను ప్రారంభించనున్నారు. అయితే.. ఈ చిత్రం కోసం ఇప్పటికే రెండు ట్రైలర్లు సిద్ధమయినట్లు తెలుస్తోంది. రెండు ట్రైలర్ల నిడివి 140 సెకండ్లు కాగా.. రెండింటిపై పూర్తి సంతృప్తిగా ఉన్నాడట జక్కన్న. అయితే.. వీటిలో దేన్ని థియేట్రికల్ ట్రైలర్ గా ఇవ్వాలనే అంశంపై మాత్రం.. తుది నిర్ణయం రాజమౌళిదే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరోవైపు.. బాహుబలి2 కోసం 4 క్లైమాక్స్ లు రెడీ చేశారట.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఎవరికీ.. కనీసం మూవీకి పని చేసే టీంకి కూడా అందకుండా ఉండేందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి. ఒక్క సినిమాకోసం రెండు ట్రైలర్లు.. నాలుగు క్లైమాక్స్ లు రెడీ చేశాడంటే.. ఈ మూవీని జక్కన్న ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్ధమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/