బాహుబలి అంతటి ఘన విజయం సాధించడానికి సినిమాలో ఎంతటి రాజసముందో సినిమా తీసిన తరువాత ప్రాచారంలో అంతకు మించిన రాజమౌళి హస్తం దాగుంది. అత్యంత తెలివిగా ప్రచారాన్ని ప్లాన్ చేసుకుంటూ బర్త్ డే టీజర్లు, పాత్రల తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ లు - ట్రైలర్ లు - ఆడియో లాంచ్ లు ప్లాన్ చేసిన రాజమౌళి సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళడంలో నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు.
సినిమా విడుదలై, ఘన విజయం సాధించిన తరువాత రెండో భాగం షూటింగ్ మొదలవడానికి మధ్య గ్యాప్ ని సైతం ప్రచారంతో పూరించడానికి సిద్ధపడ్డాడు. సినిమాలో పాత్రలను మరొకసారి గుర్తుచేసేందుకు జక్కన్న నడుంకట్టినట్టు తెలుస్తుంది.
బాహుబలిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రమ్యకృష్ణ(శివగామి) పాత్రను ట్విట్టర్ లో చేసాడు. రమ్యకృష్ణ కళ్ళపై క్లాప్ కొడుతున్న షాట్ ని పెట్టి 'ఆ కళ్ళు మొత్తం రాజ్యాన్నే శాసించాయి' అనే ట్యాగ్ లైన్ ని పెట్టాడు. ఈ ట్వీట్ కి ఆకర్షణ లభించడంతో జక్కన్న ఈ పరంపరని కంటిన్యూ చేసే అవకాశం వుంది.